ఎయిర్‌టెల్‌పై జియో ముప్పేట దాడి

Written By:

టెలికం కంపెనీల మధ్య వార్ ఇప్పట్లో తగ్గే ఛాయలు కనపడటం లేదు. తాజాగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌పై జియో విరుచుకుపడింది. తీవ్రమైన ఆరోపణలు చేసింది. దేశంలోనే తమదే ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అని చెప్పుకుంటూ ఎయిర్‌టెల్‌ తప్పుదోవపట్టిస్తుందని ఆరోపించింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఊక్లాతో కుట్రలు పన్నుతూ ఎయిర్ టెల్ తప్పుడు ప్రకటనలు చేస్తుందంటూ జియో మండిపడింది. ఈ విషయంపై అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది.

బెస్ట్ 4జీ డేటా ప్లాన్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్‌ చెప్పేదంతా అబద్ధమని

ఫాస్టెస్ట్ నెట్ వర్క్ తమదేనంటూ ఎయిర్‌టెల్‌ చెప్పేదంతా అబద్ధమని, తప్పుడుదోవ పట్టిస్తుందని జియో అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఇండియాలో ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా

అయితే ఇండియాలో ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా తమకు ఊక్లా రేటింగ్ ఇచ్చిందని ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తమ ప్రకటనలో కూడా అన్ని క్లియర్ గా పేర్కొన్నామని చెప్పారు.

లక్షల కొలదీ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ లను

ఊక్లా తన పాపులర్ స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కస్టమర్లు వాడే మోడరన్ డివైజస్ లోకి లాగిన్ అయి, లక్షల కొలదీ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ లను నిర్వహిస్తుందని ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అన్ని మొబైల్ టెస్ట్ లు దీనిలో కలిసి ఉంటాయన్నారు.

ఊక్లా డబ్బుల తీసుకుని ఇలాంటి అవార్డులు

అయితే ఊక్లా డబ్బుల తీసుకుని ఇలాంటి అవార్డులు ఇస్తుందని ముఖేష్ అంబానీ సంస్థ జియో ఆరోపిస్తోంది. ఊక్లాకు లీగల్ నోటీసు పంపుతామని తెలిపింది.

ఊక్లా బ్రాండ్ బ్యాండ్ టెస్టింగ్

ఊక్లా బ్రాండ్ బ్యాండ్ టెస్టింగ్, వెబ్ ఆధారిత నెట్ వర్క్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్ లో గ్లోబల్ లీడర్. మొబైల్స్ కి సంబంధించిన స్పీడ్ టెస్ట్ లను నిర్వహిస్తూ ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio, Airtel Fight Over Speedtest App Results: What’s Really Happening read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot