Jio, Airtel, Vodafone అధిక ధరల వద్ద అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...
ఇండియాలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అన్ని రంగాలు ఆర్థికంగా డీలా పడితే ఒక్క టెలికామ్ రంగం మాత్రం మంచి లాభాలను పొందింది. దీనికి ఉదాహరణగా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇండియాలో సగటు డేటా వినియోగం ముందు కంటే అధికంగా పెరిగింది. దీనికి కారణాలు చాలా ఉన్నప్పటికీ అన్ని టెల్కో సంస్థలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల మీద ఇచ్చే అద్భుతమైన ఆఫర్లు కూడా ఒక కారణం.

Jio, Airtel, Vodafone ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ప్రస్తుతం ప్రతి టెల్కో కూడా తమ వినియోగదారులకు అపరిమిత కాలింగ్, అపరిమిత డేటా మరియు ఉచిత SMS వంటి అనేక ప్రయోజనాలను తమ ఒక ప్లాన్ తోనే అందిస్తున్నాయి. ప్రీపెయిడ్ ప్లాన్‌లలో గల అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే కస్టమర్‌లు వాటిని వివిధ ధరల వద్ద వివిధ రకాల చెల్లుబాటు కాలాలతో పొందవచ్చు.

Jio, Airtel, Vodafone అత్యంత ఖరీదైన ప్లాన్‌లు
ప్రతి టెల్కో సంస్థ తన వినియోగదారులకు సంవత్సరం మొత్తం చెల్లుబాటుతో అద్భుతమైన ప్రయోజనాలతో కొన్ని ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ సంస్థలు అందించే అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో రూ.4,999 ప్లాన్ పూర్తి వివరాలు
రిలయన్స్ జియో సంస్థ రూ .4,999 ధర వద్ద అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అద్భుతమైన ప్రయోజనాలతో సంవత్సరానికి ఐదు రోజులు తక్కువ అంటే 360 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఇది మొత్తం చెల్లుబాటు కాలంలో 350GB అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్‌తో వస్తుంది. కానీ ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రోజువారి డేటా FUP పరిమితి లేదు. మీరు కోరుకుంటే మొత్తం 350GB డేటాను ఒకే రోజులో కూడా వినియోగించవచ్చు. దీనితో పాటు 12,000 FUP నిమిషాల నాన్-జియో కాలింగ్ మరియు అపరిమిత జియో కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటితో పాటుగా జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను కూడా అదనంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ .2,498 ప్లాన్ పూర్తి సమాచారం
ప్రముఖ ఎయిర్‌టెల్ సంస్థ రూ.5,000 ధర వద్ద కూడా ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తుంది. కాకపోతే ఇది కేవలం టాక్‌టైమ్ ప్రయోజనంతో మాత్రమే వస్తుంది. అందువల్ల ప్రస్తుతం డేటా మరియు కాలింగ్ ప్రయోజనం రెండింటినీ అందించే ప్లాన్ల వివరాలను మాత్రమే ఈ జాబితాలో వివరిస్తున్నాము. ఎయిర్‌టెల్ సంస్థ అందిస్తున్న రూ.2,498 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 2GB రోజువారీ డేటా ప్రయోజనంతో వస్తుంది. రిలయన్స్ జియో మాదిరిగా కాకుండా ఇతర నెట్‌వర్క్‌లకు కూడా కాల్ చేయడానికి FUP పరిమితి లేకుండా అన్ని కాల్‌లకు అపరిమిత కాలింగ్ ప్రయోజనంను అందిస్తుంది. దీనితో పాటుగా ఇది రోజుకు 100 SMS ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క కొన్ని ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఉచిత ZEE5 ప్రీమియం చందా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం చందా మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

వొడాఫోన్ రూ .2,399 ప్లాన్ పూర్తి సమాచారం
వొడాఫోన్ సంస్థ తన వినియోగదారులకు రూ.2,399 ధర వద్ద అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ను అందిస్తున్నది. ఇది అపరిమిత కాలింగ్ ప్రయోజనంతో పాటుగా రోజువారీ 1.5GB డేటాను అందిస్తుంది. దానితో పాటు రోజుకు 100SMSలను కూడా ఉచితంగా 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు లభించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది రూ.499ల విలువైన వొడాఫోన్ ప్లే మరియు రూ.999 విలువైన Zee5 ప్రీమియంలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








