ఈ నెలలో జియో అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లు ఇవే...
ఇండియాలోని టెలికామ్ రంగంలోకి ప్రవేశించిన తరువాత జియో అతి తక్కువ కాలంలోనే అతి పెద్ద వినియోగదారుల బేస్ ను సాధించింది. రిలయన్స్ జియో కొంతకాలంగా నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ గా కొనసాగుతున్నది.

జియో ప్రీపెయిడ్ ప్లాన్స్
నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైన జియో తన వినియోగదారులకు అపరిమిత కాలింగ్ మరియు అపరిమిత డేటా ప్రయోజనాలను అందించింది. అది మొత్తం మార్కెట్‌ను మార్చివేసింది. రిలయన్స్ జియో ప్రస్తుతం మార్కెట్లో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. జియో ఎల్లప్పుడూ తన వినియోగదారులకు క్రొత్త ఆఫర్‌లను జోడిస్తూనే ఉంది.

జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్
లాక్ డౌన్ సమయంలో కూడా తమ కస్టమర్‌లకు అధిక డేటా ఆఫర్లను అందించింది. లాక్ డౌన్ ఇప్పుడు కూడా కొనసాగుతున్నందున జూలై 2020లో రిలయన్స్ జియో తన యూజర్లకు అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
రిలయన్స్ జియోలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్లలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఇది అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS మరియు 3,000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు రోజువారి 1.5GB డేటా ప్రయోజనంను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనం విషయానికి వస్తే ఇది జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 84 రోజులు.

జియో రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
1.5GB డైలీ డేటా మొత్తం సరిపోని వారి కోసం రూ.599 ప్లాన్ ఉత్తమమైనది. ఈ ప్లాన్ 2GB రోజువారి డేటా బెనిఫిట్‌తో 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఇది అన్ని జియో నంబర్లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMS మరియు 3,000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే రిలయన్స్ జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ సభ్యత్వాన్ని అదనంగా ఉచితంగా అందిస్తుంది.

జియో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో రూ.2,599 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ VIP చందా ప్రయోజనంతో వచ్చింది. ఈ ప్లాన్ అదనంగా 10GB డేటా బోనస్‌తో పాటు 2GB రోజువారీ డేటాను కూడా అందిస్తుంది. దానితో పాటు 12,000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ , అపరిమిత జియో కాలింగ్, రోజుకు 100SMS వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

జియో రూ.2121 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్
జియో సంస్థ రూ.2121 ధర వద్ద వార్షిక ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ తో సంస్థ 1.5GB రోజువారీ డేటాను తమ వినియోగదారులకు అందిస్తున్నది. ఇది వినియోగదారులకు జియో నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఏదేమైనా కంపెనీ జియోయేతర కాల్స్‌కు 12000 నిమిషాల ఎఫ్‌యుపి పరిమితిని కలిగి ఉంది. ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా ప్లాన్‌ల చెల్లుబాటు కాలం 365 రోజులతో పోలిస్తే ఈ ప్యాక్ 336 రోజుల తగ్గింపును కలిగి ఉంది.

జియో రూ.401 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్
డిస్నీ + హాట్‌స్టార్ యొక్క ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా కోరుకునే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. అలాగే ఇది రోజువారి 3GB డేటా ప్రయోజనంను అందిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది రోజువారి 3GB డేటాతో పాటుగా 6GB బోనస్ డేటాతో కలుపుకొని మొత్తం చెల్లుబాటు కాలంలో 90GB డేటా ప్రయోజనంను అందిస్తుంది. దీనితో పాటుగా ఇది అపరిమిత కాలింగ్ మరియు 1000 FUP నిమిషాల నాన్-జియో కాలింగ్ మరియు 100 SMS / day ప్రయోజనాలను అందిస్తుంది. చివరిగా ఇది Jio యొక్క అన్ని యాప్ లకు ఉచిత కాంప్లిమెంటరీ చందా యొక్క ప్రయోజనంను కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








