యూజర్లకి షాక్... ఆ సిమ్‌లను జియో బ్లాక్ చేస్తోంది !

Written By:

రిలయన్స్ జియో యూజర్లకి షాక్ ఇవ్వబోతోంది. ధృవీకరించని రిలయన్స్‌ జియో కార్డులను బ్లాక్‌ చేసేందుకు జియో సిద్ధమవుతోంది. మీడియా నివేదికలు ప్రకారం త్వరలోనే అనేక నాన్‌ వెరిఫైడ్‌ సిమ్‌ కార్డులను నిషేధించనుందని తెలుస్తోంది. టెలీవెరిఫికేషన్ చేసుకోవాలని లేదంటే బ్లాక్ చేస్తామని యూజర్లకు ఎస్‌ఎంఎస్‌లను పంపిస్తోంది.

జియో నుంచి మరో బంపరాఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాన్‌ వెరిఫికేషన్‌ సిమ్‌లను

జియో సిమ్‌ కార్డు యూజర్లకు అందించే సమయంలో ఆధార్‌ కార్డు ను సబ్మిట్‌ చేసినప్పటికీ వెరిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా నాన్‌ వెరిఫికేషన్‌ సిమ్‌లను బ్లాక్‌ చేయనుంది.

1977

అలాగే ఇ-కేవైసీ సమర్పించని ఖాతాదారులను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా హెచ్చరిస్తుంది. లేదంటే ప్రస్తుతం వాడుతున్న జియో సిమ్‌ ద్వారా 1977 నెంబర్‌ కాల్‌ చేసిన టెలీ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.

లోకల్‌ అధార్‌ కార్డుతో

అయితే లోకల్‌ అధార్‌ కార్డుతో జియో సిమ్‌ తీసుకున్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నాన్‌ లోకల్‌ ఆధార్‌ తో తీసుకుంటే మాత్రం టెలీ వెరిఫికేషన్‌ను ఎంచుకోవాల్సిందే.

ఏప్రిల్‌ 1 నుంచి

జియో ఇప్పటికే ఈ స్క్రూట్నీ ప్రక్రియ మొదలు పెట్టిందని సమాచారం. ఏప్రిల్‌ 1 నుంచి ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియ మొదలైంది.

యూజర్లకు ఈ మేరకు ఎస్‌ఎంఎస్‌లను

దీంతోపాటు కొంతమంది యూజర్లకు ఈ మేరకు ఎస్‌ఎంఎస్‌లను పంపిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to block unverified SIM cards read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot