జియో నుంచి మరో బంపరాఫర్

Written By:

రిలయన్స్ జియో మరో బంపరాఫర్ ని ప్రకటించింది. వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 168 జిబి వరకు జియో 4జీ డేటా ఇవ్వనుంది. వారికోసం వివో జియో క్రికెట్ మానియా పేరుతో ఓ ఆసక్తికరమైన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం తొలుత వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎంపికచేసుకున్న ఐపీఎల్ టీమ్ పేరును జియో కంపెనీకి ఎస్ఎంఎస్ చేయాలి.. యూజర్ల ఫేవరెట్ టీమ్ గెలిచినా, ఓడినా లేదా మ్యాచ్ డ్రా అయిన జియో వారికి 4జీ డేటాను అందిస్తుంది.

ఆఫరంటే ఇది..రూ.103కే అపరిమిత డేటా, వాయిస్ కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

168జీబీ కంప్లిమెంటరీ డేటా పొందడమెలా...?

ఫస్ట్ వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు జియో కనెక్షన్ ఉండాలి.

59009 నెంబరుకు

ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును 59009 నెంబరుకు జియో వెబ్‌సైట్ లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఎస్ఎంఎస్ చేయాలి. టీమ్ పేర్లను, వాటి కోడ్స్ ను జియో తన వెబ్‌సైట్లో పొందుపరిచింది.

టీమ్ గెలిచినా, ఓడినా

తర్వాత యూజర్ల ఫేవరెట్ టీమ్ గెలిచినా, ఓడినా, మ్యాచ్ డ్రా అయినా 3జీబీ, 2జీబీ, 1జీబీ 4జీ డేటాను జియో అందిస్తోంది.

సిరిసీ ముగిసే సమయానికి

ఒకవేళ యూజర్ల ఫేవరెట్ టీమ్ క్వాలిఫైర్స్ గా వెళ్తే, వారి కంప్లిమెంటరీ డేటా డబుల్ అవుతుంది. ఫైనల్స్ కు రీచ్ అయితే ఆ డేటా ట్రిపుల్ అవుతుంది. సిరిసీ ముగిసే సమయానికి మీ టీమ్ అన్ని మ్యాచ్ లు గెలిస్తే 168జీబీ వరకు 4జీ డేటాను విన్ అయ్యే అవకాశముంటుంది.

మే 10 కంటే ముందస్తుగా

ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లు మే 10 కంటే ముందస్తుగా తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును జియోకు పంపించాల్సి ఉంటుంది.

జూన్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు

వచ్చే పది రీఛార్జ్‌లలో అంటే జూన్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు చేసుకునే రీఛార్జ్‌లలో కూడా యూజర్లు తమ అకౌంట్ పై అదనపు డేటా ప్రయోజనాలు పొందే అవకాశముంటుంది. ఈ డేటా బెనిఫిట్స్‌ను వాడుకోవడానికి కచ్చితంగా ప్రతినెలా రూ.303తో రీఛార్జ్ చేపించుకోవాల్సిందేనట.

వివో కంపెనీ మొబైల్స్‌తో జియో భాగస్వామ్యం

ప్రస్తుతం జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ కు వివో ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఆ కంపెనీ మొబైల్స్‌తో జియో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఈ ఆసక్తికరమైన ఆఫర్ ను జియో వివో యూజర్లకు అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio’s Vivo Jio Cricket Mania offer will let users win up to 168GB data read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot