జియోతో చేతులు కలిపిన బిఎస్ఎన్ఎల్, ఐడియా, వొడాఫోన్,

Written By:

ఈ మధ్య ఉప్పు నీరు లాగా భగ్గుమన్న టెల్కోలు ఇప్పుడు అందరి ఆలోచనలను తారుమారు చేస్తూ ఒక్కటయ్యాయి. జియోతో అన్ని కంపెనీలు ఇప్పుడు చేతులు కలిపాయి. తమ నెట్ వర్క్ షేరింగ్ ను రిలయన్స్ జియోకి ఇచ్చేందుకు అంగీకరించాయి. తాజా ఒప్పందం ద్వారా అన్ని టెల్కోలు ఇప్పుడు జియో నుంచి అలాగే జియో కష్టమర్లు ఇతర టెల్కోల ద్వారా వాయిస్ సేవలు పొందవచ్చు.

75 పైసలకే 1 జిబి డేటా: బిఎస్ఎన్ఎల్ సంచలనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

నిన్నటిదాకా ఢీ అంటే ఢీ అన్న టెలికం కంపెనీలు ఇప్పుడు అదనపు వ్యయ భారం లేకుండా ఇచ్చి పుచ్చుకునే విధానంలో తమ కవరేజీ సేవలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నెట్‌వర్క్ షేరింగ్ కోసం అన్ని కంపెనీలు చేతులు కలుపుతున్నాయి.

#2

ఇప్పటికే వొడాఫోన్, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో టై అప్ అయిన మరుసటి రోజే రిలయన్స్ జియో సైతం బీఎస్‌ఎన్‌ఎల్‌తో నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం చేసుకుంది.

#3

2జీ, 4జీ సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఒప్పందాన్ని జియో, బీఎస్‌ఎన్‌ఎల్ కుదుర్చుకున్నట్టుగా ప్రకటించాయి. ఈ కలయికతో ఇరు కంపెనీల కస్టమర్లకు మరింత విస్తృత కవరేజీ అందుబాటులోకి రానుంది.

#4

ఈ ఒప్పందం ద్వారా రిలయన్స్ జియో సేవలు బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అందుబాటులోకి రానుండగా... జియో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ పరిధిలో వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలవుతుంది.

#5

సేవల విస్తరణ, నెట్‌వర్క్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా మా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడంపై దృష్టి పెట్టాం. ఈ ఒప్పందం వల్ల రెండు కంపెనీల వినియోగదారులకు మేలు కలుగుతుంది. నిరంతరాయ సేవలు అందించడానికి వీలవుతుందని బిఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.

#6

దీంతో పాటు ఇప్పుడు మా నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఇందుకు మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు 4జీ హ్యాండ్‌సెట్‌తో జియో సేవలు అందుకోవచ్చు. ధరలను త్వరలోనే ఖరారు చేస్తాం అని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు.

#6

తాజా డీల్‌తో జియో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌పై 2జీ వాయిస్ కాల్స్ చేసుకోవడంతో పాటు రోమింగ్‌లో కవరేజీకి ఉపకరిస్తుంది' అని జియో ఎండీ సంజయ్ మష్రువాలా పేర్కొన్నారు.

#8

ఇప్పుడు ఐడియా సైతం జియోతో చేతులు కలిపింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్ కోసం మరిన్ని పోర్ట్‌లను అందుబాటులోకి తెస్తామని ఐడియా తెలిపింది.

#9

దాదాపు 18.5 లక్షల కస్టమర్ల కాల్స్ ట్రాఫిక్‌ను సపోర్ట్ చేస్తాయని పేర్కొంది. అయితే, జియో నెట్‌వర్క్ నుంచి భారీ సంఖ్యలో వచ్చే కాల్స్‌తో తమకు నష్టం వాటిల్లనున్నట్టు తెలిపింది. అయినా సేవలు అందిస్తామని తెలిపింది. 

#10

ఇంటర్‌కనెక్ట్‌పై ట్రాయ్‌తో ఇటీవల టెల్కోల భేటీ తర్వాత ఐడియా తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే దేశంలో ఇప్పటికే టాప్ లో ఉన్న ఎయిర్ టెల్ ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio BSNL in intra-circle roaming pact for 2G 4G read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot