జియో నుంచి మరో బంఫరాఫర్

Written By:

జియో ఉచిత ఆఫర్లతో దూసుకుపోతతూ ఇతర టెల్కోలకు నిదర లేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 31 వరకు వెలకమ్ ఆఫర్ పేరుతో ఉచితంగా జియోని అందించిన జియో అధినేత ముఖేష్ అంబాని దాన్ని మార్చి 2017 వరకు పొడిగిస్తున్నామంటూ దిగ్గజ టెల్కోలకు మరింతగా షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియోని ఎదుర్కోవడానికి అన్ని టెల్కోలు సరికొత్త ఆఫర్లతో దూసుకొచ్చాయి. అయితే జియోని మార్చి నుంచి మరో రెండు నెలలు పాటు పొడిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అకౌంట్లు హ్యాక్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు : మాల్యా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్చి తర్వాత మరో రెండు నెలలపాటు

సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో మరో బంపరాఫర్‌తో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. జియో తాజాగా తన ఉచిత అపరిమిత కాల్స్ ఆఫర్‌ను మార్చి తర్వాత మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్లీ దెబ్బ కొట్టేందుకు

ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న ఆఫర్‌ను ఇటీవల ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే జియో దెబ్బకు పోటీ సంస్థలు దిగివచ్చి ఉచిత ఆఫర్లు ప్రకటిస్తుండడంతో వాటిని మళ్లీ దెబ్బ కొట్టేందుకు ముకేశ్ ఉచిత సేవలను పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం.

వాటాను వదులుకునేందుకు సిద్ధంగా లేని దిగ్గజ టెలికం సంస్థలు

మరోవైపు మార్కెట్లో తమ వాటాను వదులుకునేందుకు సిద్ధంగా లేని దిగ్గజ టెలికం సంస్థలు జియో నుంచి పోటీని తట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఒకదాని వెనక ఒకటి ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

పోటీ కంపెనీల ఆఫర్లవైపు వినియోగదారులు మళ్లీపోకుండా

పోటీ కంపెనీల ఆఫర్లవైపు వినియోగదారులు మళ్లీపోకుండా ఉండేందుకే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉచిత ఆఫర్‌ను పొడిగించాలన్న నిర్ణయానికి జియో వచ్చినట్టు టెలికం విశ్లేషకుడు రాజీవ్ శర్మ అభిప్రాయపడ్డారు.

భారతీ ఎయిర్‌టెల్ విషయంలో మరింత దూకుడుగా

రెలిగేర్ సంస్థలోని టెలికం విశ్లేషకులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని రిలయన్స్ నిర్ణయించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio can offer Free Services beyond 31 March 2017, says Industry Experts read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot