జియో జోరు తగ్గుతోంది..?

టెలికం రంగంలోకి పెను సంచలనంలా దూసుకువచ్చిన రిలయన్స్ జియో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, Motilal Oswal నిర్వహించిన ఓ సర్వే ప్రకారం జియో కస్టమర్ బేస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందట.

 జియో జోరు తగ్గుతోంది..?

Read More : గూగుల్ పిక్సల్ ఫోన్‌ల పై రూ.26,000 వరకు డిస్కౌంట్

ఇదే సమయంలో జియో ఆఫర్ చేస్తున్న డేటా స్పీడ్ కూడా 50శాతానికి పడిపోయిందట. నెలకు కోటి మంది యూజర్లకు చేరువుకావాలని భావించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో అనుకున్న టార్గెట్‌లను రీచ్ కాలేకపోతున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొద్ది రోజుల్లోనే కోటి 60 లక్షల యూజర్లు

ముంబై వేదికగా రిలయన్స్ జియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే కోటి 60 లక్షల మంది యూజర్లకు చేరువైన వేగవంతమైన సర్వీసుగా జియో గుర్తింపుతెచ్చుకుంది.

45 రోజుల్లో 8 మిలియన్ యూజర్లు మాత్రమే..?

కేవలం 25 రోజుల్లో 16 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకోగలిగిన రిలయన్స్ జియో తరువాతి 45 రోజుల్లో కేవలం 8 మిలియన్ చందాదారులను మాత్రమే రాబట్టగలిగింది.

క్రమక్రమంగా డేటా స్పీడ్ తగ్గుముఖం

తమ డేటా స్పీడ్ వేగం 2ఎంబీపీఎస్ నుంచి 30ఎంబీపీఎస్ మధ్య ఉంటుందని లాంచ్ సమయంలో రిలయన్స్ జియో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతా భావించినట్లుగానే, తొలినాళ్లలో జియో డేటా స్పీడ్ అదరహో అనిపించింది. కాలక్రమంలో డేటా స్పీడ్ తగ్గుముఖం పడుతు వచ్చింది.

ప్రస్తుతం 200 కేబీపీఎస్ మధ్యే..?

ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో జియో స్పీడ్ 1ఎంబీపీఎస్ కూడా అందుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. నిలకడగా 200 కేబీపీఎస్ మధ్య జియో స్పీడ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

నోట్ల రద్దు ఎఫెక్ట్ కూడా..?

నోట్ల రద్దు ఎఫెక్ట్ కూడా జియో నెట్‌వర్క్ పై పడినట్లు తెలుస్తోంది. నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రజులు ఎక్కువ సమయాన్ని బ్యాంకులకు, ఏటీఎమ్ సెంటర్లకు కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జియో సిమ్ ను తీసుకునేందుకు అంతగా చొరవ
చూపటంలేదని తెలుస్తోంది.

కాల్ డ్రాప్స్...

కాల్ డ్రాప్స్, నెమ్మదైన డేటా స్పీడ్స్, అందుబాటులోని కస్టమర్ సర్వీస్ వంటివి అంశాలు కూడా జియో ఎదుగుదల పై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.  మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు, 2జీబి 4జీ డేటా ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Data Speeds are Down by 50 Percent, Subscriber Growth Too Slows Down. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot