జియో సునామిలో కొట్టుకుపోయిన ఎయిర్‌టెల్..

Written By:

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు రిలయన్స్‌ జియో సెగ తగిలింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రిలయన్స్‌ జియో దెబ్బతో భారతి ఎయిర్‌టెల్‌ లాభాలకు గండి పడింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం 72% క్షీణించి రూ.373.4 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ.1,319 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

రెడ్‌మి నోట్ 4 కోసం చూస్తున్నారా.. అయితే ఈ రోజే సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్తగా టెలికాం సేవల రంగంలోకి వచ్చిన

కొత్తగా టెలికాం సేవల రంగంలోకి వచ్చిన రిలయన్స్‌ జియో అనుసరించిన కొల్లగొట్టే ధరల విధానమే ఇందుకు కారణమని కంపెనీ ఎండి, సిఇఒ (ఇండియా, దక్షిణాసియా) గోపాల్‌ విఠల్‌ చెప్పారు.

చరిత్రలో తొలిసారిగా

జియో దెబ్బతో చరిత్రలో తొలిసారిగా 2016-17 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా టెలికాం రంగం ఆదాయం తగ్గిందన్నారు.

ఉచిత వాయిస్‌ కాల్స్‌ ఆఫర్‌తో

జియో ఆఫర్‌ చేసిన ఉచిత వాయిస్‌ కాల్స్‌ ఆఫర్‌తో గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఎయిర్‌టెల్‌ నెట్క్‌ వర్క్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు అవసరమైన ఆధునీకరణ కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి వచ్చిందని విఠల్‌ చెప్పారు.

జియో ఉచిత ఆఫర్ల కారణంగా

రిలయన్స్‌ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సునామీలా వెల్లువెత్తాయని చెప్పారు. తమ నెట్‌వర్క్‌లో ఈ ఇన్‌కమింగ్‌ ట్రాఫిక్‌ను తట్టుకోవడానికి చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందన్నారు.

మొత్తం టెలికం పరిశ్రమ

రిలయన్స్‌ జియో దూకుడు కారణంగా టెలికం కంపెనీలే కాకుండా మొత్తం టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్తం చేసిందని నిపుణులంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Reliance Jio Effect: Airtel Posts Smallest Quarterly Profit in Four Years read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot