జియో కొత్త సిమ్‌లు ఇవ్వొద్దు..ఏ సిమ్ యాక్టివేట్ చేయొద్దు: ఆదేశాలిచ్చిన రిలయన్స్

By Hazarath
|

90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌తో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న జియో ఇప్పుడు అంతే తలనొప్పులను తెచ్చుకుంటోంది. ఉచిత సిమ్‌ల కోసం కష్టమర్లు షో రూలం ముందు క్యూ కడుతుండటంతో వారికి ఏం చెప్పాలో తెలియక జియో ఈ విధమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే తీసుకున్నవారి సిమ్‌లు కూడా యాక్టివేట్ చేయొద్దని కూడా పిలుపునిచ్చింది. జియో అభిమానులకు ఇది నిజంగా జీర్ణించుకోలేని వార్తే.

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

#1

#1

రిలయన్స్ జియో నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఏ సిమ్ నూ యాక్టివేట్ చేయవద్దు. రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ చెప్పేవరకూ కస్టమర్లు ఎవరికీ సిమ్ కార్డులు ఇవ్వద్దంటూ జియో నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, కంపెనీ ఉద్యోగులకు మెయిల్స్ వెళ్లినట్లు అనధికార సమాచారం.

#2

#2

మీరు సిమ్ కార్డులు ఇస్తే కంపెనీకి తలనొప్పి వచ్చి ఇప్పుడున్న మంచి పేరు పోతుంది. మహారాష్ట్రలో 50 వేల సిమ్ కార్డులను యాక్టివేట్ చేయాల్సి వుంది. వాటన్నింటి యాక్టివేషన్ పూర్తయిన తరువాతే కొత్త సిమ్ లను ఇవ్వండి" అని రిలయన్స్ జియో నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, కంపెనీ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిందని తెలుస్తోంది.

#3
 

#3

రిలయన్స్ జియో సిమ్ కార్డుల కొరత దేశవ్యాప్తంగా ఉండగా, సిమ్‌లను పొందిన వారు యాక్టివేషన్ జరగక వేచి చూస్తున్న పరిస్థితుల్లో ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది.

#4

#4

మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్, కాల్స్ అందుకోవచ్చని ఆశగా రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ, థర్డ్ పార్టీ స్టోర్లకు వెళుతున్న కస్టమర్లు ఉత్త చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

#5

#5

లక్షలాదిగా వస్తున్న కస్టమర్లకు సిమ్ కార్డులను అందించడంలో విఫలమవుతున్నామని, ఇచ్చిన కార్డుల యాక్టివేషన్ తరువాత, కొత్తవి ఇస్తామని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

#6

#6

ముకేష్ అంబాని 1 మిలియన్ల మందికి అంటే ఇండియాలో దాదాపు 90 శాతం మందికి జియో కనెక్ట్ కావాలని ఏజీఎమ్ మీటింగ్ లో పిలుపునిచ్చారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే వేరే విధంగా ఉన్నాయి.

#7

#7

దేశ వ్యాప్తంగా 4జీ జియో సేవల కోసం ఇప్పటిదాకా రిలయన్స్ 20 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 1.35 లక్షల కోట్లకు పెగానే ఖర్చు పెట్టింది.

#8

#8

దేశంలో ఉన్న 125 కోట్ల జనాబాలో ఇప్పటికే చాలామంది రిలయన్స్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయితే జియో బయటకు వచ్చే నాటికి 10 కోట్ల మందిని జియో నెట్ వర్క్ లోకి తీసుకురావడమే లక్ష్యంగా ముకేష్ అంబాని పనిచేస్తున్నారు. కాని అది నెరవేరే సూచనలు కనపడటం లేదు.

#9

#9

బీటా పేరుతో ఎటువంటి మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నా... 90 రోజుల ఉచిత అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ సేవలు అంటూ యూజర్లకు రిలయన్స్ జియో ఆఫర్ ప్రకటించింది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది అయినా ముందుకు వెళుతోంది.

#10

#10

ప్రివ్యూ ఆఫర్ తో దేశ వ్యాప్తంగా జియో సంచలనం రేపుతున్న జియో ఇప్పుడు 4జీ నుంచి 5జీ 6జీ దిశగా ఇప్పటినుంచే వడివడిగా అడుగులు వేస్తోంది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

#11

#11

దేశంలో ఇప్పుడు ట్రెండింగ్ అంశం ఏదైనా ఉందంటే అది జియోనే.. మరి ఆ జియో ఎలా పుట్టింది. ఎక్కడ నుంచి మరెక్కడికి తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్లింది. అసలు ఆ కంపెనీ గురించి ప్రపంచానికి తెలిసిన విషయాలు ఏంటీ..ఏ పేరుతో పుట్టి మరే పేరుతో మార్కెట్ ని శాసిస్తోంది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

#12

#12

ఆసక్తికర విషయాల కోసం క్లిక్ చేయండి ఆసక్తికర విషయాల కోసం క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio Faces Shortage Of Free SIM Cards Across India read more gizbot telugu..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X