Jio పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లు OTT ప్రయోజనాలతో అందుబాటులోకి వచ్చేసాయి!!!

|

2019 సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ AGM ఈవెంట్ లో ప్రకటించిన 'జియోపోస్టుపెయిడ్ ప్లస్' ప్లాన్లను ఎట్టకేలకు నేడు విడుదల చేసింది. JioPostpaid Plus కొత్త ప్లాన్లు రూ.399 నుండి ప్రారంభమవుతాయి. ఇవి అన్ని కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ వంటి మరిన్ని OTT సబ్స్క్రిప్షన్లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

జియోపోస్టుపెయిడ్ ప్లస్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

జియోపోస్టుపెయిడ్ ప్లస్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో జియో మరోసారి తన యొక్క ప్రత్యర్థులకు అతి పెద్ద సవాలును విసురుతున్నది. ఇది అంతర్జాతీయ ప్రయాణికులకు ఇన్-ఫ్లైట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఎంపికను కూడా తీసుకువస్తోంది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ పథకం కింద రూ.399 నుంచి రూ.1,499 వరకు మొత్తం ఐదు ప్లాన్‌లు ఉన్నాయి. జియో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.399, రూ .599 ప్లాన్‌ల వివరాలు

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.399, రూ .599 ప్లాన్‌ల వివరాలు

రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లను రూ.399, రూ .599, రూ .799, రూ.999 మరియు రూ.1,499 వంటి ఐదు రకాల ధరల వద్ద ప్రకటించింది. రూ.399 ధర వద్ద లభించే జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాల విషయానికి వస్థే ఇది వినియోగదారులకు 75GB నెలవారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు SMS‌లను ప్రతి బిల్లింగ్ సైకిల్ మరియు 200GB వరకు డేటా రోల్‌ఓవర్ ఎంపికను అందిస్తుంది. రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 100GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ & ఎస్‌ఎంఎస్, 200GB డేటా రోల్‌ఓవర్, ఫ్యామిలీ ప్లాన్‌తో ఒక అదనపు సిమ్ కార్డ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.799, రూ.999 ప్లాన్‌ల పూర్తి వివరాలు

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.799, రూ.999 ప్లాన్‌ల పూర్తి వివరాలు

రూ.799 ధర వద్ద లభించే జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికొస్తే ఇది 150GB డేటాతో 200GB డేటా రోల్‌ఓవర్, అన్‌లిమిటెడ్ వాయిస్ & SMSల‌తో పాటు ఫ్యామిలీ ప్లాన్‌తో పాటు రెండు అదనపు సిమ్ కార్డుల ప్రయోజనంను అందిస్తుంది. తదుపరిది రూ.999 ధర వద్ద లభించే జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్ ఫ్యామిలీ ప్లాన్‌లో భాగంగా ప్రతి నెలా 500GB డేటా రోల్‌ఓవర్ సౌకర్యం, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు మూడు అదనపు సిమ్ కార్డులతో వినియోగదారునికి 200GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

 

Also Read: IPL 2020ను ఉచితంగా చూడటానికి టెల్కోల ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...Also Read: IPL 2020ను ఉచితంగా చూడటానికి టెల్కోల ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.1499 ప్లాన్‌ పూర్తి వివరాలు

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ రూ.1499 ప్లాన్‌ పూర్తి వివరాలు

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లలో చివరగా అందిస్తున్న రూ.1,499 ప్రీమియం ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది జియో యూజర్ల ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు 500GB వరకు డేటా రోల్‌ఓవర్ సదుపాయం లభిస్తుంది. అలాగే భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు USA, UAE దేశాలలో అపరిమిత డేటా మరియు వాయిస్‌ ప్రయోజనాలు కూడా పొందుతారు.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ల అదనపు OTT ప్రయోజనాలు

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ల అదనపు OTT ప్రయోజనాలు

రిలయన్స్ జియో కొత్తగా ప్రవేశపెట్టిన అన్ని రకాల జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ మరియు Jio యొక్క స్వంత యాప్ లు జియో టీవీ, జియో సినిమా వంటి మరిన్ని OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి. ఈ ధర వద్ద నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందించడం అనేది రిలయన్స్ జియో నుండి వస్తున్న అతి పెద్ద మంచి చర్య.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ కనెక్షన్ పొందడం ఎలా?

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ కనెక్షన్ పొందడం ఎలా?

రిలయన్స్ జియో వినియోగదారులను వారి ఇంటి వద్దనే జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ కనెక్షన్‌ను పొందడానికి అనుమతిస్తుంది. అవును మీరు సరిగ్గా విన్నారు. రిలయన్స్ జియో మరియు ఇతర నెట్‌వర్క్‌ల ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ యూజర్లు వాట్సాప్‌లో ‘HI' అని 8850188501 కు మెసేజ్ పంపి సులభంగా పొందవచ్చు. మెసేజ్ పంపిన తర్వాత కంపెనీ సిమ్ కార్డును మీ ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది. మీరు ఫ్యామిలీ ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక మీరు ఎంచుకున్న అన్ని సిమ్ కార్డులు కూడా బట్వాడా చేయబడతాయి. ఇంకా ఇతర నెట్‌వర్క్‌లలో ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ప్రస్తుత క్రెడిట్ పరిమితితో కొనసాగవచ్చని జియో తెలిపింది.

Best Mobiles in India

English summary
Reliance Jio Finally Released Postpaid Plus Plans: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X