మీ ఫోన్ స్క్రీన్ లాక్ ఎంతవరకు సురక్షితం?

|

ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద స్మార్ట్ ఫోన్‌ల ఉపయోగం ఎక్కువ అయింది. ఫోన్‌లను కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి మాత్రమే కాకుండా అన్ని రకాల ప్రయోజనాలకు ఉపోయాయోగిస్తున్నారు. ఇప్పుడు ఫోన్‌ లేనిదే ఎవరు కూడా బయటకు వెళ్లడం లేదు.

ఫోన్‌ యాక్సిస్

ఫోన్‌ యాక్సిస్

అన్ని రకాల పేమెంట్స్ చేయడానికి కూడా ఫోన్‌లను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజల యొక్క డేటా, గోప్యత మరియు భద్రత వంటి విషయాలు మరింత సున్నితంగా మారాయి. ప్రజలు వారి యొక్క ఫోన్‌ను ఒకరకమైన యాక్సిస్ ద్వారా భద్రపరచడం అందరు చేస్తూ ఉంటారు.Also Read:ఒకే IMEI నెంబర్ మీద పనిచేస్తున్న 13,500 వివో స్మార్ట్‌ఫోన్లు!!! జర జాగ్రత్త...

 స్క్రీన్ లాక్‌

స్క్రీన్ లాక్‌

అయితే ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం దాదాపు మూడవ వంతు అమెరికన్లు ఎలాంటి స్క్రీన్ లాక్‌ని ఉపయోగించడం లేదు అని తెలిపారు. 2020 లో మీ ఫోన్ యొక్క భద్రతను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:PM Modi యొక్క కొత్త బోయింగ్ 777 VVIP ప్లేన్!!! ఎయిర్ ఫోర్స్ వన్ కు సమానమైన ఫీచర్స్

పాటర్న్ లాక్

పాటర్న్ లాక్

పాటర్న్ లేదా నమూనా లాక్ దీని పేరుకు సూచించినట్లుగా వినియోగదారుడు తన ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి ఒక నిర్దిష్ట నమూనాను నమోదు చేయాల్సిన అవసరం ఉంది. స్క్రీన్ లాక్ ఎంపికల విషయంలో 'పాటర్న్ లాక్' మీడియం-రేంజ్ భద్రత ఎంపికగా పరిగణించబడతాయి. పాటర్న్ లాక్ లో L ను గీయడం చాలా సులభం. కానీ మీరు కొంచెం కష్టతరమైన ఆకారాన్ని గీయడం ద్వారా పాటర్న్ లాక్ ను మరింత కష్టతరం చేయవచ్చు. ఇటువంటి పాటర్న్ లాక్ ను మరొకరు మీ భుజం మీద నుండి చూసి దానిని కాపీ చేయడం సులభం. Also Read:Mubadala- Jio Deal: రూ.9,093.60 కోట్ల తో జియో కొత్త డీల్, మరింత పెరిగిన మార్కెట్ వేల్యూ

పాటర్న్ లాక్ లాభాలు

పాటర్న్ లాక్ లాభాలు

పాటర్న్ లాక్ యొక్క ఒకసారి స్వైప్ నమూనాను 64.2% పునసృష్టి చేయడంలో లర్కర్లు విజయవంతమయ్యారని పరిశోధనలో తేలింది. బహుళ పరిశీలనలతో ఆ ప్రమాదం పెరుగుతుంది. ఫీడ్‌బ్యాక్ లైన్లను ఆపివేయడం ద్వారా మరియు మరింత అధునాతన నమూనాను ఎంచుకోవడం ద్వారా మీరు మీ భద్రతను మెరుగుపరచవచ్చు.

PIN/password

PIN/password

మీరు స్మార్ట్‌గా ఉండి మీ ఆండ్రాయిడ్ పరికరాల్లో ఏదైనా రక్షణను సెటప్ చేయాలనుకుంటే కనుక పిన్ లాక్ / పాస్‌వర్డ్ ఎంపిక అన్నిటికంటే సురక్షితమైనది. మీరు ఫోన్ ఆపివేసినప్పుడు మరియు తిరిగి ఆన్ చేసినప్పుడల్లా ఎంటర్ చేయమని మీ సిమ్ కార్డ్ కోరే కోడ్ ఇది. అన్ని రకాల ఆండ్రాయిడ్ సంస్కరణలు నాలుగు అంకెల కోడ్‌ను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. కానీ మీరు మీ భద్రత గురించి మరింత ఎక్కువ శ్రద్ధ వహిస్తే కనుక ఎక్కువ పిన్ నంబర్లు గల కోడ్‌ను ఎంచుకోవచ్చు.

పిన్ లాక్ / పాస్‌వర్డ్ విధానాలు

పిన్ లాక్ / పాస్‌వర్డ్ విధానాలు

మీరు మీ లాక్ గేమ్‌ను ఎంచుకోవాలనుకుంటే మీరు కనీసం 8 అక్షరాల పొడవు గల అక్షరాలు, సంఖ్యలు మరియు ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న పాస్‌వర్డ్‌ను ఎంచుకోవచ్చు. దీనిని గుర్తుంచుకోవడం మరియు టైప్ చేయడం కొంచెం కష్టం కావచ్చు కానీ దీర్ఘకాలంగా మీరు మీ యొక్క ఫైల్ లను సురక్షితంగా ఉంచవచ్చు. ఇందులో మరొక గొప్ప ఫీచర్ కూడా ఉంది అనేక విఫలమైన లాగిన్ ప్రయత్నాల తర్వాత మీ ఫోన్‌ను తుడిచిపెట్టే లక్షణాన్ని మీరు ముందే ఆన్ చేస్తే కనుక మీ యొక్క డేటాను ఎవరు దొంగలించలేరు.

ఫింగర్ ప్రింట్ లాక్

ఫింగర్ ప్రింట్ లాక్

అదృష్టవశాత్తూ మనలో కొంతమందికి ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ లాక్ వంటివి ఇప్పటికీ తెలియదు. మీరు వేర్వేరు రకాల కారణంగా ఫింగర్ ప్రింట్ లాక్ తో పాటుగా మరికొన్ని బటన్లతో కూడా లాక్ ను పొందుపరచబడ్డాయి. తాజా అభివృద్ధిలో భాగంగా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లో కూడా ఫింగర్ ప్రింట్ ఫీచర్ అందుబాటులో ఉంది. మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి వేలిముద్ర లాక్‌ను వేగవంతమైన మార్గాలలో ఒకటిగా పరిగణించవచ్చు. మీ వేలిని రీడర్‌పై ఉంచడం ద్వారా మీ ఫోన్ సెకనులోపు అన్‌లాక్ అవుతుంది.

ఫింగర్ ప్రింట్ లాక్ లోపాలు

ఫింగర్ ప్రింట్ లాక్ లోపాలు

అయితే ఇది ఫూల్‌ప్రూఫ్? సాధారణ వ్యక్తులు ఆందోళన చెందుతున్నట్లు బయోమెట్రిక్ లాక్ ద్వారా డేటాను దొంగలించాలనుకుని ప్రయత్నించే వారికి ఇది కాస్త అగ్ని పరీక్ష లాంటిది. అయినప్పటికీ వేలిముద్ర లాక్‌ను ఓపెన్ చేయడం పూర్తిగా అసాధ్యం కాదు. వేలిముద్రలు ఫోటోలు మరియు ఇతర వనరుల నుండి దొంగిలించబడతాయి. తరువాత కేవలం 2D ప్రింటింగ్‌తో సృష్టించవచ్చు. తరువాత వీటిని బయోమెట్రిక్ లాక్ లను ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తారు. 2017 లో ఒక భద్రతా పరిశోధకుడు జర్మనీ రక్షణ మంత్రి వేలిముద్రను అధిక రిజల్యూషన్ ఛాయాచిత్రాల నుండి సృష్టి చేయగలిగాడు.

Face scan

Face scan

ఈ బయోమెట్రిక్ లాక్ అనేది దీని యొక్క పేరుకు తగ్గట్టుగా ఇది మీ ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా అధునాతనమైనది మరియు అధిక సంఖ్యలో సాంకేతిక అద్భుతాలను కలిగిస్తుందని మీరు ఉహించినప్పటికీ ఇది ప్రాథమికంగా మీ ముందు కెమెరా మరియు కొన్ని సాఫ్ట్‌వేర్‌లపై ఆధారపడుతుంది. కెమెరా మీ ముఖం యొక్క చిత్రాన్ని స్కాన్ చేసి ఆపై మీ ముఖాన్ని ధృవీకరించడానికి ముఖ గుర్తింపు అల్గోరిథం మీద ఆధారపడుతుంది. అన్‌లాక్ యొక్క వేగం మీ ఫోన్ మరియు దాని ముందు కెమెరా నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది.

పేస్ స్కాన్ ఫీచర్ లోపాలు

పేస్ స్కాన్ ఫీచర్ లోపాలు

ఈ పేస్ స్కాన్ ఫీచర్ అంత సురక్షితం కాదు. చెడ్డవారు ఎవరైనా మీ ముఖం యొక్క ఫోటోతో దాన్ని మోసం చేయవచ్చు. వాస్తవానికి పరిశోధకులు 110 వేర్వేరు స్మార్ట్‌ఫోన్‌లపై ఒక పరీక్షను నిర్వహించారు. వారు కనుగొన్నది ఏమిటంటే ఇది అందమైన చిత్రాన్ని చిత్రించలేదు. సాధారణంగా పాస్‌కోడ్‌తో కలిపి ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ లాక్‌ను కలిగి ఉండటం మరింత సురక్షితమైన మార్గం.

తుది తీర్పు

తుది తీర్పు

ప్రస్తుతం మీరు ఎంచుకోవడానికి చాలా రకాల లాక్ ఎంపికలు ఉన్నాయి. కేవలం ఒకదానిపై మాత్రమే ఆధారపడకుండా రెండు మూడు రకాల లాక్ ఫీచర్ల కలయికను ఎన్నుకోవడం ఎల్లప్పుడూ తెలివిగా ఉంటుంది. కానీ జాబితాలో సురక్షితమైన ఎంపిక మరియు నమ్మదగినది పిన్ లేదా తగినంత పొడవు గల పాస్‌వర్డ్ ఎంపిక. తరువాత స్థానంలో ఫింగర్ ప్రింట్ స్కాన్ వస్తుంది. మీరు ఏ ఎంపికను ఎంచుకున్నా ముందుగానే ప్లాన్ చేయడం ఎల్లప్పుడూ తెలివైనది.

Best Mobiles in India

English summary
How to Secure Your Phone Lock Screen: Here are Some Tips

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X