జియో బంపరాఫర్, 224జిబి 4జీ డేటా రూ. 509కే

Written By:

రిలయన్స్ జియో తన జియోఫై రూటర్‌ను కొత్తగా కొనుగోలు చేసే వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం జియోఫై రూటర్‌ను, దాంతోపాటు కొత్త జియో సిమ్‌ను తీసుకుంటే యూజర్లకు భారీ మొత్తంలో ఉచితంగా 4జీ డేటాను అందిస్తున్నది. అందుకు ఏం చేయాలంటే...

రూ. 500కే 4జీ వోల్ట్ ఫోన్ , ఈ నెలలోనే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ఫై రూటర్

ముందుగా జియో ఫై రూటర్ కొనాల్సి ఉంటుంది. దాని ఖరీదు రూ.1,999గా ఉంది. ఇక ఆ రూటర్‌లో కొత్తగా తీసుకున్న జియో 4జీ సిమ్‌ను వేశాక రూ.99 ప్రైమ్ మెంబర్‌షిప్ రీచార్జి చేసుకోవాలి.

రూ.509తో రీచార్జి

అనంతరం రూ.509తో రీచార్జి చేసుకుంటే యూజర్లకు 224 జీబీ 4జీ డేటా ఫ్రీగా వస్తుంది. దానికి వాలిడిటీ 112 రోజులు ఉంటుంది. రోజుకు గరిష్టంగా 2జీబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చు.

రూ.149, రూ.309, రూ.999

ఇక రూ.509 కాకుండా రూ.149, రూ.309, రూ.999 ప్యాక్‌లకు కూడా ఉచిత డేటాను యూజర్లు పొందవచ్చు. రూ.149తో రీచార్జి చేసుకుంటే ఏడాది పాటు నెలకు 2 జీబీ డేటా లభిస్తుంది.

రూ.309

రూ.309తో రీచార్జి చేసుకుంటే 168 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 168 జీబీ డేటా లభిస్తుంది.

రూ.999

రూ.999 ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే 120 జీబీ డేటా లభిస్తుంది. దీనికి రోజువారీ లిమిట్ లేదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ 56 రోజుల వాలిడిటీ మాత్రమే ఉంటుంది. నూత‌నంగా రిల‌య‌న్స్ జియోఫై రూట‌ర్‌, సిమ్‌ల‌ను కొన్న‌వారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Is Giving 224GB of 4G Data at Rs. 509: Here Are the Offer Details Read More At gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot