రూ. 500కే 4జీ వోల్ట్ ఫోన్ , ఈ నెలలోనే !

Written By:

భారతీయో టెలికం రంగంలోకి ఓ ఉప్పెనలా దూసుకొచ్చిన జియో దిగ్గజ టెల్కోలకు కంటటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిససిందే. అయితే తాజాగా మొబైల్ కంపెనీలకు చుక్కలు చూపించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఉచిత డేటా, ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సేవలతో టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన జియో తాజాగా ఫీచర్ ఫోన్‌ల జాబితాలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

జియో ప్లాన్లు మారాయి, యూజర్లకు ఇక తిప్పలే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరో సంచనలనానికి జియో రెడీ

టెలికం మార్కెట్లో మరో సంచనలనానికి జియో రెడీ అయింది. అతి త్వరలో అత్యంత చవక ధరలో ఫీచర్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. రివీల్ అయిన నివేదికల ప్రకారం ఈ 4జీ ఫీచర్ ఫోన్ ధర తాజాగా రూ. 500లుగా ఉండనుంది.

రూ. 500లకే

దేశమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రూ.1500 ఉంటుందని అంతా భావించినప్పటికీ రూ. 500లకే అందించనుందట. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.

ఈ నెలలోనే

4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో ఈ నెలలోనే ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రారంభించనుంది. బ్రోకరేజ్ హెచ్ఎస్‌బీసీ అంచనా ప్రకారం రూ. 500 కే అందించనుంది.

ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌కు ధీటుగా

ఈ నెల(జూలై) 21 వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఈ ఫీచర్‌ ఫోన్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు త్వరలో ముగియనున్న ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌కు ధీటుగా మరో సరికొత్త టారిఫ్ ప్లాన్‌తో జియో కస్టమర్ల ముందుకు రానుంది.

నేరుగా 4కి మారడానికి

2జీ మొబైల్‌ వినియోగదారులపై కన్నేసిన జియో నేరుగా 4కి మారడానికి ఈ 4జీ ఫీచర్‌ ఫోన్‌ పదునైన ఆయుధంగా వాడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోసారి వినియోగదారులకు

అద్భుతమైన ఆఫర్‌, తక్కువ ధరలో ఫీచర్‌ ఫోన్‌ మేలు కలయికతో జియో మరోసారి వినియోగదారులకు ఆకట్టుకోనుందని హెచ్‌ఎస్‌బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకుడు రాజీవ్ శర్మ భావిస్తున్నారు.

84 రోజుల ధన్‌ ధనాధన్‌ ఆఫర్‌

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌11 న ప్రకటించిన 84 రోజుల ధన్‌ ధనాధన్‌ ఆఫర్‌ త్వరలో ముగియనున్నసంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio may disrupt the market again with a Rs 500 4G VoLTE handset Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot