డిసెంబర్ 3 తరువాత Jio నుంచి మరో ఆఫర్

రిలయన్స్ జియో తన వెల్‌కమ్ ఆఫర్‌ను మార్చి 2017 వరకు పొడిగించనుందంటూ గత కొంత కాలంగా అనేక రూమార్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

Read More : నోరు విప్పిన నోకియా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆసక్తికర చర్చ..

డిసెంబర్ 3వ తేదీ కంటే ముందు జియో 4జీ సిమ్‌ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే వెల్‌కమ్ ఆఫర్ వర్తిస్తుందని కొద్ది నెలల క్రితం జియో అనౌన్స్ చేసిన ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ తేదీ తరువాత జియో సిమ్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి అనే దాని పై మార్కెట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెరపైకి వెల్‌కమ్ ఆఫర్ 2

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘వెల్‌కమ్ ఆఫర్ 2' పేరుతో జియో సరికొత్త ఆఫర్‌ను డిసెంబర్ 3వ తేదీన మార్కెట్లో అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రాయ్ నిబంధనల ప్రకారం..

టెలికం ఆపరేటర్లు అందించే ప్రమోషనల్ ఆఫర్స్ కేవలం 90 రోజులు మాత్రమే వ్యాలిడిటీని కలిగి ఉండాలన్న ట్రాయ్ నిబంధనల నేపథ్యంలో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జియో టార్గెట్ 100 మిలియన్ యూజర్లు..

జియో ఆఫర్ చేయబోయే ‘వెల్‌కమ్ ఆఫర్ 2' కూడా 90 రోజుల వ్యాలిడిటీతో లభించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఏట్లాగైనా 100 మిలియన్ యూజర్లకు చేరువకావాలన్న సంకల్పంతో ఉన్న జియో, ఈ ఆఫర్‌ను మరింత విస్తృతంగా మార్కెట్లోకి తీసుకువెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

కొత్త కస్టమర్‌లకు మాత్రమే..?

జియో లాంచ్ చేయబోయే ‘వెల్‌కమ్ ఆఫర్ 2' డిసెంబర్ 3 తరువాత జియో సిమ్‌ను కొనుగోలు చేసిన కొత్త కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట.

జనవరి 1, 2017 నుంచి..

సెప్టంబర్ 5న లాంచ్ చేసిన మొట్టమొదటి వెల్‌కమ్ ఆఫర్ ముందుగా ప్రకటించిన విధంగానే డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. వీళ్లు జనవరి 1, 2017 నుంచి జియో అందుబాటులో ఉంచిన ఏదో ఒక ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది. షాకింగ్.. రూ.2000 నోటును స్కాన్ చేస్తే?

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Might Not Extend Welcome Offer Until March 2017, Instead Introduce Welcome Offer 2. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting