Home
News

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌కు మరో ముప్పు

ఉచిత ఆఫర్లతో టెల్కోలను ముప్పతిప్పలు పెడుతున్న రిలయన్స్ జియోకి ఇప్పుడు మరో సమస్య ఎదురయింది.

By Hazarath

ఉచిత ఆఫర్లతో టెల్కోలను ముప్పతిప్పలు పెడుతున్న రిలయన్స్ జియోకి ఇప్పుడు మరో సమస్య ఎదురయింది. జియో ఆఫర్ చేస్తున్న హ్యాపీ న్యూయర్ టారిఫ్ ప్లాన్లకు ఇబ్బంది వచ్చి పడింది. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో అందిస్తున్న సేవలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయంటూ క్లీన్‌చీట్ ఇచ్చిన వెంటనే ట్రాయ్‌పై టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్‌లు పోరాటానికి దిగాయి. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పీలెంట్ ట్రిబ్యునల్(టీడీశాట్) వద్ద ట్రాయ్‌పై ఫిర్యాదు దాఖలు చేశాయి.

బడ్జెట్ రేంజ్‌లో మార్కెట్లోకి మరో కొత్త 4జీ వోల్ట్ ఫోన్

ఉచిత వాయిస్, డేటా సర్వీసులపై వివరణ

ఉచిత వాయిస్, డేటా సర్వీసులపై వివరణ

టెలికాం దిగ్గజాల ఫిర్యాదు మేరకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందిస్తున్న ఉచిత వాయిస్, డేటా సర్వీసులపై వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్, రెగ్యులేటరీని ఆదేశించింది.

ఫిబ్రవరి 15లోపు క్లారిఫికేషన్

ఫిబ్రవరి 15లోపు క్లారిఫికేషన్

జియో ప్రకటించిన వెల్ కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండూ వేర్వేరు అని ట్రాయ్ గతవారమే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే అవి ఎలా వేర్వేరో తెలుపుతూ ఫిబ్రవరి 15లోపు క్లారిఫికేషన్ ఇవ్వాలని ట్రాయ్‌ని ట్రిబ్యునల్ ఆదేశించింది.

ఫిర్యాదు దాఖలు చేసిన ఎయిర్‌టెల్, ఐడియాలు

ఫిర్యాదు దాఖలు చేసిన ఎయిర్‌టెల్, ఐడియాలు

టీడీశాట్ వద్ద ఫిర్యాదు దాఖలు చేసిన ఎయిర్‌టెల్, ఐడియాలు ఉచిత కాల్స్, డేటా సర్వీసులు అందిస్తున్న ప్రమోషనల్ ఆఫర్‌నే పేరు మార్చి వినియోగదారులకు అందించడానికి జియోకు రెగ్యులేటరీ అనుమతించిందని ఆరోపిస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధమంటూ..

నిబంధనలకు విరుద్ధమంటూ..

నిర్దేశిత 90 రోజులను కూడా అధిగమించి జియో 2017 మార్చి దాకా ఉచిత వాయిస్, డేటా ఆఫర్లను అందించడం నిబంధనలకు విరుద్ధమంటూ పేర్కొన్నాయి. ట్రాయ్ టెలికాం టారిఫ్ ఆర్డర్లను జియో ఉల్లంఘిస్తుందని చెప్పాయి.

ఫిబ్రవరి 20కు వాయిదా

ఫిబ్రవరి 20కు వాయిదా

తదుపరి విచారణ ఫిబ్రవరి 20కు వాయిదా వేసింది. ఇప్పటికే వొడాఫోన్ కేసులో రిలయన్స్ సతమతమవుతోంది. మళ్లీ ఇది మెడకు చుట్టుకోవడంతో రిలయన్స్ దిక్కు తోచని స్థితిలో పడింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio Offers: TDSAT Seeks TRAI Clarification read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X