రూ. 1.8 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాం,ఇక ఆదాయంపై గురిపెట్టండి : జియో

Written By:

టెల్కోలకు చుక్కలు చూపిస్తూ కేవలం ఆరు నెలల్లో యూజర్ల సంఖ్యను పది కోట్లకు పెంచుకున్న రిలయన్స్‌ జియో తాజాగా ఇప్పుడు టెలికం పరిశ్రమ ఆదాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొబైల్‌ డేటా వినియోగం వల్ల ఏర్పడే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో కంపెనీ ఆదాయాన్ని బాగా పెంచుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది.

జియోకి సవాల్..రూ.346కే 28 జిబి 4జీడేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

50 శాతం వాటాను 2021 కల్లా సాధించడమే తమ లక్ష్యంగా

దేశీయ టెలికాం రంగ ఆదాయంలో 50 శాతం వాటాను 2021 కల్లా సాధించడమే తమ లక్ష్యంగా పనిచేయండని ఉద్యోగులకు రిలయన్స్ సూచించింది.

నెలకు రూ.500 చెల్లించే సామర్థ్యం కలిగిన చందాదార్లు 40 కోట్ల మంది

జియో నెట్‌వర్క్‌పై రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం. అనుకున్నట్లే దేశంలో డేటాకు అధిక గిరాకీ లభిస్తోంది. డేటా సేవల కోసం నెలకు రూ.500 చెల్లించే సామర్థ్యం కలిగిన చందాదార్లు 40 కోట్ల మంది ఉన్నారు. 

సంస్థకు ఇదే ప్రధాన ఆదాయం

సంస్థకు ఇదే ప్రధాన ఆదాయం కానుంది. దీంతో పాటు 5జీ సేవలకు సిద్ధంగా ఉన్న నెట్‌వర్క్‌ ఇదేనని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

పడిపోనున్న వాయిస్ కాల్స్

2021కి టెలికాం పరిశ్రమ ఆదాయం రూ.3 లక్షల కోట్లకు చేరనుంది. ప్రస్తుతం వాయిస్‌ కాల్స్‌ ఆదాయం రూ.1.50 లక్షల కోట్లు కాగా, ఇది రూ.50,000 కోట్లకు పడిపోనుందని రిలయన్స్ ధీమాతో చెబుతోంది.

ప్రభుత్వానికి 50 శాతం ఆదాయం

ఇదే క్రమంలో డేటా ఆదాయం రూ.1.50 లక్షల కోట్లకు పెరుగుతుందని, అప్పుడు నెలకు 500-600 కోట్ల జీబీ డేటా వినియోగం జరగవచ్చని జియో అంచనా వేస్తోంది. గిరాకీ పెరిగే కొద్దీ, ప్రభుత్వానికి ఆదాయం కూడా 50 శాతం అధికమవుతుంది. జీబీ డేటాకు రూ.50 చొప్పున గణించినా, ఏడాదికి రూ.3-3.6 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది.

జియో 4జీ బ్రాడ్‌బ్యాండ్‌ మొబైల్‌ సేవలు

అన్ని రకాల ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌పై జియో 4జీ బ్రాడ్‌బ్యాండ్‌ మొబైల్‌ సేవలు పొందొచ్చు. ఇందువల్ల అధిక డేటా బదిలీ సాధ్యమవుతోందని కష్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio plans to overtake Airtel, hit 50% revenue market share in 4 years read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting