జియోకి సవాల్..రూ.346కే 28 జిబి 4జీడేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్

Written By:

జియో టారిఫ్ ప్లాన్లను ప్రకటించడంతో అన్ని టెల్కోలు ఇప్పుడు కష్టమర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా జియోకి ధీటైన ఆఫర్లను అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ వరసలో ఇప్పుడు వొడాఫోన్ కూడా చేరింది. జియోను బీట్ చేసేలా ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించాలని భావిస్తోంది. ఈ ఆఫర్ జియో 303 ప్లాన్ ను బీట్ చేసేలా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి.

పానాసోనిక్ నుంచి సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్లు, ధర ఎంతంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

346 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే

వొడాఫోన్ యూజర్లు 346 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 28జీబీ 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ 28 రోజుల పాటు పొందొచ్చని ఈ ఆఫర్ తర్వలో వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

జియో 303 రూపాయల ప్యాక్‌‌కు ప్రత్యామ్నయంగా

రిలయన్స్ జియో 303 రూపాయల ప్యాక్‌‌కు, 346 రూపాయల ప్యాక్ ప్రత్యామ్నయంగా విడుదల చేయాలని వొడాఫోన్ భావిస్తోంది. 303 రూపాయల ప్యాక్ కేవలం జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన వారికి మాత్రమే వర్తిస్తుందని ముఖేష్ అంబానీ తెలిపారు.

ఎటువంటి నిబంధనలు లేవు

వొడాఫోన్ ప్రకటించాలని భావిస్తున్న 346 రూపాయల ప్యాక్‌పై ఎటువంటి నిబంధనలు లేవు. వొడాఫోన్ కస్టమర్లందరికీ ఈ ప్యాక్ వర్తిస్తుంది.

మొదటి సారి రీచార్జ్ చేయించుకునే కస్టమర్లకు

అంతేకాదు, 346 రూపాయలతో మొదటి సారి రీచార్జ్ చేయించుకునే కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ కూడా వరించనుంది. డబుల్ డేటా విత్ డబుల్ వ్యాలిడిటీ బెన్‌ఫిట్స్‌ను వినియోగదారులు పొందొచ్చు.

346 రూపాయలకు 56 జీబీ

మొదటిసారి రీచార్జ్ చేసుకుంటే 346 రూపాయలకు 56 జీబీ, 56 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుందని సమాచారం. అయితే ఈ ఆఫర్‌పై వొడాఫోన్ అధికారికంగా ఎటువంటి వివరాలు ప్రకటించలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone offers 28GB 4G data and unlimited calls for Rs 346, beats Jio on price read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot