జియోతో పోటీకి వచ్చే ఆఫర్లు

Written By:

రిలయన్స్ జియొ ప్రవేశపెట్టిన ఆఫర్లతో టెల్కోలకు చుక్కలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జియోను ఎదుర్కునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.దీంతో త‌మ యూజ‌ర్ల‌ను అలాగే ఒడిసి ప‌ట్టుకునేందుకు ఇత‌ర కంపెనీలు కూడా జియో లాంటి ఆఫ‌ర్ల‌నే ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలో జియోకు పోటీగా ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌లో ల‌భిస్తున్న అలాంటి ఆఫ‌ర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ ప్లే మ్యూజిక్ వచ్చింది, మొదటి నెల ఫ్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిల‌య‌న్స్ జియో

రిల‌య‌న్స్ జియోకు చెందిన రూ.303 ప్లాన్ ద్వారా యూజ‌ర్ల‌కు 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1 జీబీ ఫ్రీ డేటా చొప్పున 28 రోజుల‌కు 28 జీబీ డేటా వ‌స్తుంద‌ని తెలిసిందే.

ఎయిర్‌టెల్‌...

ఇందులో రూ.345తో రీచార్జి చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ 4జీ డేటా (0.5 జీబీ ప‌గ‌లు, 0.5 జీబీ రాత్రి) వ‌స్తుంది. నెల‌పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆఫ‌ర్ రూ.349కు ల‌భిస్తోంది.

వొడాఫోన్‌...

రూ.346తో రీచార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్ వ‌స్తాయి. దీంతోపాటు రోజుకు 1జీబీ డేటా ఫ్రీగా వ‌స్తుంది.

బీఎస్ఎన్ఎల్‌...

ఇందులో రూ.339తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు యూజ‌ర్ల‌కు రోజుకు 2 జీబీ డేటా ఫ్రీగా వ‌స్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ వ‌స్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Reliance Jio Prime offer: 3 'best' competing plans read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot