Home
News

jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...

ఇండియాలోని టెలికాం రంగంలో కొత్త మార్పులకు మొదట శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో రూ.11 చౌకైన ధర వద్ద అందించే 4G డేటా వోచర్‌ను ఇప్పుడు కొత్తగా సవరించింది. రూ.11 ధర గల 4G డేటా వోచర్ ఇప్పటివరకు 800MB డేటాను అందించేది. కొత్త మార్పుల తరువాత ఈ ప్లాన్ ఇప్పుడు వినియోగదారులకు 1GB డేటాను అందిస్తోంది. రూ.11 4G డేటా వోచర్‌ మినహా మిగిలిన రూ.21, రూ.51, రూ.101 ధరల డేటా వోచర్‌లు మునుపటి ప్రయోజనాలను మాత్రమే అందిస్తున్నాయి. ఈ 4G డేటా వోచర్‌లతో వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని తొలగించినట్లు ఇటీవలే సంస్థ ప్రకటించింది. మునుపటి ప్రయోజనాలతో పోల్చితే వినియోగదారులు ఇప్పుడు 25% వరకు అధికంగా డేటాను పొందుతున్నందున రూ.11 వోచర్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో 4G డేటా వోచర్ల ప్రయోజనాలు

రిలయన్స్ జియో 4G డేటా వోచర్ల ప్రయోజనాలు

రిలయన్స్ జియో యొక్క డేటా వోచర్లలో చౌకైన ధర రూ.11 వద్ద లభించే 4G డేటా వోచర్‌ యొక్క సరికొత్త మార్పుల తరువాత 800MB 4G డేటా ప్రయోజనాన్ని 1GB 4G డేటాకు పెంచింది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు మీ ప్రస్తుత ప్లాన్ కు సమానంగా ఉంటుంది. ఇవి కేవలం 4G డేటా వోచర్లు కాబట్టి వాయిస్ కాలింగ్ లేదా SMS వంటి ఇతర ప్రయోజనాలను పొందలేరు. అలాగే రూ.21 ధర వద్ద గల డేటా ప్యాక్ 2GB 4G డేటాను, రూ.51 ధర వద్ద గల డేటా ప్యాక్‌ 6GB 4G డేటాను చివరిగా రూ.101 డేటా ప్యాక్‌ 12GB 4G డేటా బెనిఫిట్ ఆఫర్‌తో వస్తుంది.

జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ల ప్రయోజనాలు

జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ల ప్రయోజనాలు

రిలయన్స్ జియో టెల్కో 4G డేటా వోచర్‌లతో పాటు మరొక మూడు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌లను రూ.151, రూ.201 మరియు రూ.251 ధరల వద్ద అందిస్తున్నాయి. ఇవి వరుసగా 30GB, 40GB, 50GB డేటా ప్రయోజనాలతో లభిస్తున్నాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ కూడా వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను కలిగి ఉండవు.

జియో ఆఫ్-నెట్ నిమిషాల బెనిఫిట్ ప్లాన్‌లు

జియో ఆఫ్-నెట్ నిమిషాల బెనిఫిట్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో యొక్క 4G డేటా వోచర్‌లకు 2020 ప్రారంభంలో ఆఫ్-నెట్ నిమిషాలు ప్రయోజనాల జాబితాలో చేర్చడం జరిగింది. రూ.11 4G డేటా వోచర్ మొదట 75 నాన్-జియో నిమిషాలతో పాటు 800MB డేటాను మొదట అందించేది. అయితే ఇప్పుడు జియో ఆఫ్-నెట్ కాలింగ్ ప్రయోజనాన్ని తీసివేయడంతో పాటుగా ప్రస్తుత మీ ప్లాన్ యొక్క వాలిడిటీకు సమానమైన చెల్లుబాటుతో అందిస్తుంది. కస్టమర్ బేస్ మారకుండా ఉండటానికి రిలయన్స్ జియో యొక్క ఎత్తుగడలలో ఇవి ఒకటి అని చెప్పవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio Rs 11 Data Voucher Plan Now Offers 1GB Mobile Data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X