Home
News

Jio Rs.999 Plan: 3GB రోజువారి డేటా, కాంప్లిమెంటరీ ఉచిత సర్వీస్...

రిలయన్స్ జియో సంస్థ ఇండియాలో తన వినియోగదారుల సంఖ్యను రోజు రోజుకు అధికంగా పెంచుకుంటూ పోతోంది. అతి తక్కువ కాలంలో ఇండియాలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ గా ఎదిగిన జియో జనవరిలో దాదాపు 6.5 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకున్నది.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్ల కోసం కొన్ని ఉత్తమమైన ప్లాన్లను సరసమైన ధరల వద్ద అద్భుతమైన ప్రయోజనాలతో అందిస్తున్నది. వినియోగదారుల కోసం ఎప్పుడు కొత్త కొత్త ప్లాన్లను విడుదల చేసే రిలయన్స్ జియో ఇటీవల 999 రూపాయల ధర వద్ద మరొక కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు 84 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఇది మాత్రమే కాదు జియో కస్టమర్లకు ఈ ఆఫర్ కింద వివిధ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్స్

ఇంటి వద్ద నుండి పని చేస్తున్న వినియోగదారులకు అవసరమైన అధిక డేటాను దృష్టిలో పెట్టుకొని రిలయెన్స్ జియో "వర్క్ ఫ్రమ్ హోమ్" ప్లాన్ కింద రోజూ 3GB డేటాను అందించే సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో రూ.999 ధర వద్ద వస్తుంది. అంటే సుమారు మూడు నెలల పాటు ఈ ప్లాన్ ను వాడుకోవచ్చు.

రిలయన్స్ జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

మూడు నెలల మొత్తం చెల్లుబాటు కాలంలో ఇది మొత్తంగా 252GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే ఇది రోజుకు 3GB డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా అయిపోయన తరువాత డేటా యొక్క స్పీడ్ 64kbps ‌కు తగ్గించబడుతుంది. ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక డేటాతో పాటు జియో-టు-జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయం ఉంది. అలాగే నాన్-జియో కాల్స్ కి 3,000 నిమిషాల వాయిస్ కాల్స్ FUP పరిమితి ఉంది. అలాగే రోజుకు 100SMS ల ప్రయోజనం కూడా లభిస్తుంది. వీటితో పాటు అన్ని జియో యాప్స్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

రిలయన్స్ జియో రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 84 రోజుల చెల్లుబాటుతో రూ.555, రూ.599 ధర వద్ద మరొక రెండు ప్లాన్ లను అందిస్తున్నాయి. కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టడంతో రిలయన్స్ జియో ఇప్పుడు ఒకే చెల్లుబాటు వ్యవధితో మొత్తంగా మూడు వేర్వేరు ప్లాన్ లను అందిస్తుంది. రూ.555 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 1.5GB హై-స్పీడ్ డేటా, జియో-టు-జియో అపరిమిత కాలింగ్‌ మరియు 3,000 నిమిషాల జియోయేతర కాల్స్ ప్రయోజనాలు లభిస్తాయి. ప్రీపెయిడ్ ప్లాన్ కింద 84 రోజులకు వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తుంది.

రిలయన్స్ జియో రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో యొక్క రూ .599 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజువారీ 2GB హై-స్పీడ్ డేటా ప్రయోజనం లభిస్తుంది. దీనితో పాటుగా 3,000 నిమిషాల నాన్-జియో కాలింగ్, అపరిమిత జియో-టు-జియో కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు పొందుతారు. పైన తెలిపిన మూడు ప్లాన్‌లు కూడా వినియోగదారులకు జియో టివి, జియో సినిమా వంటి జియో యాప్‌ల యొక్క కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా పొందుతారు.

జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌

జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌

లాక్‌డౌన్ కారణంగా హైస్పీడ్ డేటా అవసరం పెరిగింది. అనేక మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం డేటా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్వార్టర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ను రూ.999 ధరకు రూపొందించింది రిలయెన్స్ జియో. ఇక దీంతో పాటు రోజూ 2 జీబీ డేటాతో వర్క్ ఫ్రమ్ హోమ్ యాన్యువల్ ప్లాన్‌ను అందిస్తోంది జియో. ఈ ప్లాన్ ధర రూ.2399. మరోవైపు 336 రోజుల పాటు రోజూ 1.5 జీబీ డేటా అందించే రూ.2,121 ప్లాన్‌ను రిలయెన్స్ జియో కొనసాగిస్తోంది.

రిలయన్స్ జియో రూ .11, రూ .21, రూ .51, రూ .101 4G డేటా వోచర్లు

రిలయన్స్ జియో రూ .11, రూ .21, రూ .51, రూ .101 4G డేటా వోచర్లు

జియో యొక్క రూ .11 ప్రీపెయిడ్ బూస్టర్ ప్యాక్ ప్లాన్ ఇప్పుడు ఉన్న చెల్లుబాటుపై 800MB డేటాను మరియు జియో నాన్-జియో కాలింగ్‌ కోసం 75 నిమిషాలను అందిస్తుంది.సవరించిన తరువాత ఇప్పుడు రూ .11 యొక్క జియో ప్రీపెయిడ్ బూస్టర్ ప్యాక్ ప్లాన్ వినియోగదారులకు 2GB డేటా మరియు 200 నిమిషాల జియో నుండి నాన్ జియో వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కూడా ప్రస్తుత ప్లాన్ రన్‌పై ఆధారపడి ఉంటుంది.

రిలయన్స్ జియో రూ .251 డేటా వోచర్‌

రిలయన్స్ జియో రూ .251 డేటా వోచర్‌

రిలయన్స్ జియోలో ప్రసిద్ధి చెందిన రూ.251 డేటా వోచర్‌ను సవరించలేదు. ఈ ప్రణాళికతో వినియోగదారులు రోజుకు 2GB డేటాను పొందుతారు. కాని కంపెనీ ఇంకా కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందించడం లేదు. అవుట్‌గోయింగ్ వాయిస్ కాల్స్ చేయడానికి మీరు ఇప్పటికే ఉన్న ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి) టాప్-అప్ వోచర్‌ను కొనుగోలు చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio Rs 999 Prepaid Plan Launched: 3GB Daily Data, 84 Days Validity and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X