ఆఫరంటే ఇది..రూ.103కే అపరిమిత డేటా, వాయిస్ కాల్స్
టెలినార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియోకి పోటీగా ఈ ఆఫర్ ని ప్రకటించినట్లు టెలినార్ తెలిపింది.
జియో రాకతో టెలికం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీలు భారీ ఎత్తున్న డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమతమ డేటా రేట్లను భారీగా తగ్గించగా.. తాజాగా టెలినార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియోకి పోటీగా ఈ ఆఫర్ ని ప్రకటించినట్లు టెలినార్ తెలిపింది.
కసి మీద ఉన్న జియో, ఏం చేయబోతోంది..?

103 రూపాయలకే
కేవలం 103 రూపాయలకే అపరిమిత కాలింగ్, 4జీ డేటాను టెలినార్ అందిస్తోంది. యూజర్లందరూ తమ టెలినార్ నెంబర్ పై రూ.103తో రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది.

అపరిమిత 4జీ డేటా 60 రోజుల పాటు
ఈ స్కీమ్ కింద యూజర్లకు అందుబాటులో ఉండే అపరిమిత 4జీ డేటా 60 రోజుల పాటు వాడుకోవచ్చట. అదేవిధంగా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని 90 రోజులు వరకు వాడుకోవచ్చని తెలిపింది.

కొత్త 4జీ యూజర్లైతే
రూ.103 ప్యాక్ కింద కొత్త 4జీ యూజర్లైతే 25 రూపాయల ఉచిత టాక్ టైమ్ తో పాటు నిమిషానికి 25 పైసలు మాత్రమే కాల్ ఛార్జ్ భరించేలా రూపొందించింది.

రోజుకు 2జీబీ
అదేవిధంగా అపరిమత 4జీ డేటా లిమిట్ కూడా వారు రోజుకు 2జీబీ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 128కేబీపీఎస్ కు పడిపోతుంది.

అన్ని సర్కిళ్లలో
టెలినార్ 4జీ సర్వీసులను ఆఫర్ చేసే అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications