జియో సార్తి డిజిటల్ అసిస్టెంట్ ఎలా పనిచేస్తుంది?

|

రిలయన్స్ జియో తన నెట్‌వర్క్‌లో డిజిటల్ రీఛార్జ్‌ల ప్రక్రియను మరింత సులభతరం చేయాలనుకుంటుంది.రిలయన్స్ ఆపరేటర్ జియో సార్తి అనే యాప్ ని తన వినియోగదారుల కోసం ఇన్-యాప్ డిజిటల్ అసిస్టెంట్‌గా పరిచయం చేశారు.జియో సార్తి డిజిటల్ అసిస్టెంట్ మైజియో యాప్ లో విలీనం చేయబడింది.ఇది జియో వినియోగదారులకు అన్నీ రకాల రీఛార్జిలను సులభంగా చేయడానికి సహాయం చేస్తుంది.

reliance jio saarthi digital assistant launched to ease digital recharge

వినియోగదారులు వారి డిజిటల్ రీఛార్జిలను మరింత సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఇంటిగ్రేషన్ సహాయపడుతుంది. జూలై 27 చివరి నాటికి సార్తి ఇంటిగ్రేషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు డిజిటల్ రీఛార్జ్ చేయని వారికి మాత్రమే ఇది లభిస్తుంది. మీరు జియో యూజర్ అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో మైజియో యాప్ ఓపెన్ చేసి దీని యొక్క ప్రయోజనాలను తనిఖీ చేయవచ్చు.\

జియో సార్తి అంటే ఏమిటి?:

జియో సార్తి అంటే ఏమిటి?:

డిజిటల్ రీఛార్జ్‌లలో వినియోగదారులకు సహాయం చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో జియో సార్తి యాప్ ని కంపెనీ పరిచయం చేసింది. ఇది మైజియో యాప్ ద్వారా సరైన రీఛార్జ్ ప్యాక్‌ని ఎంచుకోవడానికి దశల వారీ వాయిస్ సూచనలను అందిస్తుంది. ఇది చెల్లింపు వివరాలను గుర్తించి డిజిటల్ రీఛార్జిల కోసం క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి చెల్లింపు చేయడానికి వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తుంది. సార్తి మొదట్లో ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మాత్రమే లభిస్తుంది. భారతదేశంలో తమ వినియోగదారులకు రీఛార్జ్ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి 12 ప్రాంతీయ భాషలను కూడా చేర్చాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

జియో సార్తి వివరాలు:

జియో సార్తి వివరాలు:

మైజియో యాప్‌లోని జియో సార్తి ఫీచర్‌ను కంపెనీ మొట్టమొదటి డిజిటల్ చొరవగా అభివర్ణిస్తోంది. ఈ ఫీచర్ ఇంకా ఆన్‌లైన్ రీఛార్జ్ చేయని కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. జియో తన కస్టమర్లలో ఎక్కువ మందికి వారి సంఖ్యలకు డిజిటల్ రీఛార్జిలు చేయడానికి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతుంది. ఈ ప్రక్రియలో వోడాఫోన్ ఐడియాను వెనుకకు నెట్టి ఆపరేటర్ భారతదేశం యొక్క నంబర్ 1 టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన వెంటనే ఈ ఫీచర్ ను తీసుకువచ్చింది. జియో ప్రస్తుతం 331.3 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది.

జియో సార్తి ఎలా పని చేస్తుంది?:

జియో సార్తి ఎలా పని చేస్తుంది?:

జియో సార్తీని పొందడానికి మీరు మొదట మైజియో యాప్ యొక్క తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. ఇది డిజిటల్ అసిస్టెంట్ ఫ్లోటింగ్ ఐకాన్ రూపంలో అందించబడుతోంది. వినియోగదారులు డిజిటల్ రీఛార్జ్ చేయాలనుకున్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. ప్రతి రీఛార్జిపై వాయిస్ ఆధారిత మార్గదర్శకత్వం పొందడానికి ఫ్లోటింగ్ చిహ్నాన్ని నొక్కాలి. దీనిని నొక్కడం ద్వారా రీఛార్జిని చేయడానికి మీకు సహాయపడుతుంది. ఇది వినియోగదారులకు వారి అవసరాలకు తగిన ప్రణాళికను ఎంచుకుని ఆపై పేమెంట్ చేయడానికి సహాయపడుతుంది.

Best Mobiles in India

English summary
reliance jio saarthi digital assistant launched to ease digital recharge

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X