జియోకి మండింది: Airtel, Idea, vodafone లైసెన్స్ రద్దు చేయాల్సిందే !

Written By:

టెలికం కంపెనీల మధ్య ఇప్పుడు భారీ యుద్దమే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎయిర్ టెల్ , రిలయన్స్ జియోల మధ్యన మొదలైన స్వల్ప యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ గాలివానలో ఇప్పుడు ఐడియా, వొడాఫోన్లను కూడా రిలయన్స్ ఇరికించింది. ఇతర టెల్కోల వినియోగదారులు తమ నెట్ వర్క్ పరిధిలోకి వస్తుంటే రానివ్వకుండా ఈ సంస్థలు అడ్డుపడుతున్నాయని రిలయన్స్ జియో ఆరోపిస్తోంది.

unlimited data,1Gbps స్పీడ్‌తో జియో బ్రాడ్‌బాండ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో సంచలన ఆరోపణలు

టెలికం కంపెనీలపై రిలయన్స్ జియో సంచలన ఆరోపణలు చేసింది. యూజర్ల నెంబర్ పోర్టబిలిటీని ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర సంస్థలు అడ్డుకుంటున్నాయంటూ ఆరోపించింది.

యూజర్ల రిక్వెస్టులను

వినియోగదారులు కొత్త నెట్‌వర్క్‌కు మారేందుకు ఈ సంస్థలు అంగీకరించడం లేదని పేర్కొంది. యూజర్ల రిక్వెస్టులను ఆయా సంస్థలు నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది.

9 నుంచి 12వ తేదీ మధ్య కాలంలో

ఈనెల 9 నుంచి 12వ తేదీ మధ్య కాలంలో నెంబర్ పోర్టబిలిటీ కోసం వినియోగదారులు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించాయని వివరించింది.

4,919 రిక్వెస్టులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులు చేసుకున్న 4,919 రిక్వెస్టులు వీటికి అదనమని పేర్కొంది. వారికి ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని మా పరిధిలోకి రాకుంగా అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తోంది.

ట్రాయ్'కు లేఖ

ఆయా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటూ చర్యలు తీసుకోవాల్సిందిగా ‘ట్రాయ్'కు లేఖ రాసింది. ఇటువంటి సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయాలని రిలయన్స్ కోరింది.

నిబంధనలకు విరుద్ధమని

ఇలాంటి చర్యలు లెసైన్స్ నిబంధనలకు విరుద్ధమని తెలియజేసింది. టెల్కోలు లెసైన్స్ నిబంధనలను కచ్చితంగా అమలుచేసేలా చూడాలని ట్రాయ్‌ని కోరింది.

రిలయన్స్ ఆరోపణలపై

అయితే రిలయన్స్ ఆరోపణలపై ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలు ఈ అంశమై ఎలాంటి ప్రకటన చేయలేదు.

దేశంలో ఎయిర్‌టెల్‌దే రాజ్యం

దేశంలో ఎయిర్‌టెల్‌దే రాజ్యం: పోరాడుతున్న బిఎస్ఎన్ఎల్..మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి

అన్నతో తమ్ముడి వార్

అన్నతో తమ్ముడి వార్ : జియోని దెబ్బ కొట్టేందుకేనా..? మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio seeks action against major telcos for violating MNP rules and WiFi rules Read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting