త్వరగా రీచార్జ్‌ చేసుకోవాలంటూ జియో కస్టమర్లను కోరడం కరెక్టేనా..?

Written By:

జియోపై ఫిర్యాదు బాటలో ఇప్పుడు వొడాఫోన్ కూడా చేరింది. జియో అందిస్తోన్న సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌పై టెలికం కంపెనీ వొడాఫోన్‌ టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌కి ఫిర్యాదు చేసింది. ప్రకటిత సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌లో నిబంధనల ఉల్లంఘన ఉందని రెగ్యులేటర్‌ తెలియజేసినప్పటికీ జియో ఆ ఆఫర్‌ను ఇంకా కొనసాగిస్తోందని ఫిర్యాదులో ఆరోపించింది.

ఫోన్ నుంచే మీ పీఎఫ్ డ్రా !

త్వరగా రీచార్జ్‌ చేసుకోవాలంటూ జియో కస్టమర్లను కోరడం కరెక్టేనా..?

ఆఫర్‌ను వెనక్కు తీసుకోవాలని ట్రాయ్‌ తమను ఆదేశించిందని, ఆఫర్‌ను వీలైనంత త్వరగా వెనక్కు తీసుకుంటామని జియో పేర్కొనడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడింది. సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ ప్రయోజనాలు పొందటానికి త్వరగా రీచార్జ్‌ చేసుకోవాలంటూ జియో కస్టమర్లను కోరడం కరెక్ట్‌ కాదని పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ ఉటంకిస్తూ వొడాఫోన్‌ ట్రాయ్‌కి ఒక లేఖ రాసింది.

1gbpsతో స్పీడ్‌తో జియో బ్రాడ్‌బాండ్ , 3 నెలలు ఫ్రీ !

త్వరగా రీచార్జ్‌ చేసుకోవాలంటూ జియో కస్టమర్లను కోరడం కరెక్టేనా..?

ఆఫర్‌ ప్రయోజనాల కోసం త్వరగా రిచార్జ్‌ చేసుకోవాలంటూ జియో తన యూజర్లకు, రిటైలర్లకు మెసేజ్‌లు కూడా పంపిందని తెలియజేసింది. సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ను తక్షణం ఉపసంహరించుకునేలా జియోని ఆదేశించాలని కోరింది. కాగా ఆఫర్‌ను వెనక్కు తీసుకోవాలని ట్రాయ్‌ ఏప్రిల్‌ 6న జియోని ఆదేశించిన విషయం తెలిసిందే.

 

 

English summary
Vodafone files complaint with TRAI against Reliance Jio Summer Surprise offer read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot