తుఫాను కన్నా వేగంగా రిలయన్స్ జియో 4జీ

Written By:

తుఫాను కన్నా వేగంగా రిలయన్స్ 4జీ జియో దూసుకువస్తోంది. రిలయన్స్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ జియో ఇప్పుడు బయటకు వచ్చింది. రిలయన్స్ గ్రూపు వ్యవస్థాపకుడు ధీరుబాయ్ అంబానీ 83వ జయంతి సందర్భంగా రిలయన్స్ జియో 4జీ సేవలను ముకేష్ అంబానీ ప్రారంభించారు. అయితే ఈ జియో 4జీ ఇప్పుడు రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్ కష్టమర్లు ఈ 4జీ జియో సేవలు పొందాలంటే ఏప్రిల్ వరకు ఆగక తప్పదు.

Read more: ఆవు పిడకలకు అమెజాన్‌లో భలే డిమాండ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశ టెలికాం రంగంలో కొత్త చరిత్ర

దేశ టెలికాం రంగంలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ జియో కంపెనీ రిలయన్స్‌ గ్రూపు కంపెనీల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాముల కోసం ‘జియో' బ్రాండ్‌ పేరుతో 4జి టెలికాం సేవలు ప్రారంభించింది.

ధీరూభాయ్‌ అంబానీ 83న జయంతి సందర్భంగా

రిలయన్స్‌ గ్రూపు వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీ 83న జయంతి సందర్భంగా నేవి ముంబైలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ జియో సేవలు ప్రారంభించారు

దాదాపు 35,000 మంది ఉద్యోగులు

దాదాపు 35,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా వెయ్యికిపైగా కేంద్రాల నుంచి 80,000 మందికి పైగా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ టూ వే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా

ఈ సందర్భంగా ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ టూ వే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొంత మంది ఉద్యోగులతో మాట్లాడారు. రిలయన్స్‌ జియో బ్రాండ్‌ అంబాసిడర్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.రహమాన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రహమాన్‌ తన సంగీతంతో ప్రేక్షకులను

రహమాన్‌ తన సంగీతంతో ప్రేక్షకులను ఆలరించారు. ప్రయోగాత్మకంగా ఉద్యోగులతో ప్రారంభమైన రిలయన్స్‌ జియో 4జి టెలికాం సేవలు వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి దేశ వ్యాప్తంగా వాణిజ్య స్థాయిలో ప్రారంభం కానున్నాయి.

ఎల్‌వైఎఫ్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్లతో పాటు

ఈ సందర్భంగా రిలయన్స్‌ జియోకు చెందిన ఎల్‌వైఎఫ్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్లతో పాటు, జియోకు చెందిన ఇతర ఉత్పత్తులను ప్రదర్శించారు. దీంతో దేశ టెలికాం రంగంలో పోటీ మరింత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు.

జియో బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయం గా ఆయనే వెల్లడించారు.

వచ్చే ఆదివారం నుంచి సిబ్బందికోసం

వచ్చే ఆదివారం నుంచి సిబ్బందికోసం సంస్థ 4జీ సర్వీసులను ప్రారంభించనున్నది. మార్చి-ఏప్రిల్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఈ సర్వీసు లు అందుబాటులోకి రానున్నాయి.

ముకేశ్ భాయ్ ఈ విషయాన్ని వెల్లడించారని

రిలయన్స్ జియోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాను..ముకేశ్ భాయ్ ఈ విషయాన్ని వెల్లడించారని షారూక్ ఖాన్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం విదితమే.

జియోతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు

జియోతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని, ఒక భారత్‌లోనే గాక..ప్రపంచ దేశాల్లో టెలికం రంగ రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయని షారూక్ అన్నారు.

అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు

అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించడంతో సమాచార మార్పిడి సులభతరంకానున్నదని షారూక్ తెలిపారు. దేశవ్యాప్తంగా వేగవంతమైన 4జీ సర్వీసులు అందించేందుకుగాను రిలయన్స్ జియో 751.1 మెగాహెడ్జ్ స్పెక్ట్రాన్ని కొనుగోలు చేసింది.

షారూక్ ఖాన్ గతంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు

షారూక్ ఖాన్ గతంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

రిలయన్స్ జియో రాకతో టెలికం రంగంలో

రిలయన్స్ జియో రాకతో టెలికం రంగంలో ఇప్పుడు మరో కొత్త చరిత్రకు నాంది పలికుతుందన్నది సుస్పష్టంగా తెలుస్తోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Reliance Jio services launched for employees: Here’s all you need to know
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot