తెలుగు రాష్ట్రాల్లో జియో సిమ్ హోమ్ డెలివరీ షురూ!
దేశవ్యాప్తంగా 12 నగరాల్లో అందుబాటులోకి..
జియో సిమ్ హోమ్ డెలివరీ ప్రక్రియను 12 మెట్రోపాలిటిన్ నగరాల్లో ప్రారంభించినట్లు రిలయన్స్ జియో ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. ఈ రెండు ప్రాంతాలకు చెందిన యూజర్లు జియో సిమ్‌ను ఆర్డర్ చేసేందుకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
Read More : ఫోన్‌లో పోర్న్ వెబ్‌సైట్‌లు చూస్తున్నారా..?

స్టెప్ 1
ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి జియో ఫేస్‌బుక్ పేజీలోకి లాగిన్ అవ్వండి. ఆ పేజీలో మీకు "Get Your Jio SIM Home Delivered" పేరుతో ఓ లింక్ కనిపిస్తుంది.

స్టెప్ 2
"Get Your Jio SIM Home Delivered" లింక్ పై క్లిక్ చేసిన వెంటనే Sign Up ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3
సైనప్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే కొన్ని వివరాలతో కూడిన ప్రత్యేకమైన బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్‌లో మీ మెయిల్ ఐడీ అలానే మీ మొదటి పేరును ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే కాలమ్‌లో మీ అడ్రస్‌ను ఎంటర్ చేసి, మీరు ఉంటున్న నగరాన్ని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 4
ప్రస్తుతం జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీస్ 12 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. అహ్మదాబాద్, బెంగళూరు, చండీఘడ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నావీ ముంబై, పూణే, విశాఖపట్నం.

స్టెప్ 5
యూజర్ తన వివరాలన్నింటిని కరెక్ట్‌గా ఎంటర్ చేసిన తురవాత పేజీ క్రింద కనిపించే Schedule SIM delivery అనే ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే జియో సిమ్ ఆర్డర్ విజయవంతమైనట్లే. త్వరలో సిమ్ డిస్పాచ్ కాబడుతుంది.

సిమ్ డెలివరీ సమయంలో..
సిమ్ డెలివరీ సమయంలో యూజర్ ముందుగా డాక్యుమెంట్‌లో పేర్కొన్న అడ్రస్‌లోనే ఉండాలి. అంతేకాకుండా ఆధార్ కార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. అమ్మకానికి రూ.2000 నోటు, ఎంతో తెలుసా..?
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








