అమ్మకానికి రూ.2000 నోటు, ఎంతో తెలుసా..?

రద్దు చేయబడిన రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో రూ.2,000 నోటును కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసిన విషయం తెలసిందే. కొత్త నోట్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే లక్కీ సీరియల్ నెంబర్స్‌తో ఉన్న రూ.2000 నోట్లను పలువురు సెల్లర్స్ బుధవారం ఓ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది.

Read More : ఫోన్‌లో పోర్న్ వెబ్‌‌సైట్‌లు చూస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.3,500 నుంచి రూ.1.51 లక్షల వరకు

ఈ నోట్ల ప్రారంభ ధరను రూ.3,500గా నిర్థారించారు. సీరియల్ నెంబర్‌లను బట్టి నోట్ల రేట్లకు విలువకట్టారు. 786 సీరియల్ నెంబర్ తో ప్రారంభమైన రూ.2000 నోటు ధరను ఏకంగా రూ.1.51 లక్షలుగా ఉంచారు.

ఫ్యాన్స్ నెంబర్లతో వచ్చే వస్తువులను

ఫ్యాన్స్ నెంబర్లతో వచ్చే వస్తువులను ఎక్కువ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసే సంస్కృతి భారత్‌లో అనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. రెసిడెన్షియల్ అడ్రస్‌లు మొదలకుని మొబైల్ నెంబర్స్ ఇంకా నెంబర్ ప్లేట్ల వరకు ఇటువంటి ట్రెండ్ కొససాగుతూనే ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొనుగోలు చేసారా, లేదా అన్నది వెల్లడికావల్సి ఉంది

ఈబేలో అమ్మకానికి ఉంచిన రూ.2000 నోట్టను ఎవరైనా కొనుగోలు చేసారా, లేదా అన్నది వెల్లడికావల్సి ఉంది. ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లలో ప్రత్యేకమైన నెంబర్లతో ఉన్న కరెన్సీ నోట్లను విక్రయిస్తున్నారంటూ మధ్య ప్రదేశ్ హైకోర్ట్ eBay India సహా అన్ని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ లకు గతేడాది జూలైలో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

రూ.1 నోట్లను 100 రెట్ల ఎక్కువ మొత్తానికి?

నవంబర్‌లో కొందరు సెల్లర్స్ లేటెస్ట్ సిరీస్‌తో వచ్చిన రూ.1 నోట్లను 100 రెట్ల ఎక్కువ మొత్తనాకి అంటే రూ.100కు ఈ-కామర్స్ సైట్‌లలో విక్రయించినట్లు తెలుస్తోంది.

రూ.20, రూ.50 నోట్లు కూడా..

పెద్దనోట్టను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం తీసుకున్న తరువాత రూ.20, రూ.50 నోట్లను కూడా ఆన్‌లైన్ మార్కెట్లో విక్రయించినట్లు సమాచారం.

రూ.50 నోటు ధర రూ.5,000?

ప్రత్యేక నెంబర్లతో ఉన్న మూడు 20 నోట్లను రూ.900 చొప్పున, 786 నెంబర్‌తో
ఉన్న మూడు రూ.50 నోట్లను రూ.5000 చొప్పున విక్రయించినట్లు సమాచారం.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Rs 2000 note on sale for Rs 1.51 lakh online?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot