జియో సమ్మర్ సర్‌ప్రైజ్, 100 జిబి ఉచిత డేటా, కొత్త ప్లాన్స్ ఇవే !

Written By:

ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న జియో సమ్మర్ సర్ ప్రైజ్ పేరిట సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఇటీవ‌లే జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించి, 303 రూపాయ‌ల‌తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెల‌లు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని తెలిపిన విష‌యం తెలి‌సిందే. అయితే ఈ ఆఫర్ తో పాటు మరిన్ని ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. జియో ప్ర‌క‌టించిన వివ‌రాల ప్ర‌కారం..

ఐటెల్ 4జీ ఫోన్ రూ. 5,840కే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.303తో రీచార్జి చేసుకుంటే

రూ.303తో రీచార్జి చేసుకుంటే 28 జీబీ 4జీ డేటా (రోజుకు 1 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు. అంతేగాక నెలకు అదనంగా 5 జీబీ 4జీ డేటా ఉచితంగా పొంద‌వ‌చ్చు.

రూ.499తో రీచార్జి చేసుకుంటే

రూ.499తో రీచార్జి చేసుకుంటే 56 జీబీ 4జీ డేటా (రోజుకు 2 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు.. ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు, దీనిలో నెలకు అదనంగా 10 జీబీ 4జీ డేటా కూడా ఉచితంగా పొంద‌వ‌చ్చు.

రూ.999తో రీచార్జి చేసుకుంటే

రూ.999తో రీచార్జి చేసుకుంటే 60 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటాతో అందిస్తోంది.

రూ.1999తో రీచార్జి చేసుకుంటే

రూ.1999తో రీచార్జి చేసుకుంటే 125 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 90 రోజుల కాల వ్య‌వ‌ధితో అందిస్తోంది. దీంతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా కూడా పొంద‌వ‌చ్చు.

రూ.4999తో రీచార్జి చేసుకుంటే

రూ.4999తో రీచార్జి చేసుకుంటే 350 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఆరునెల‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. 100 జీబీ ఉచిత డేటా కూడా పొంద‌వ‌చ్చు.

రూ.9999తో రీచార్జి చేసుకుంటే

ఇక‌ రూ.9999తో రీచార్జి చేసుకుంటే 750 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 360 రోజుల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్ల‌కు కూడా అదనంగా 100 జీబీ ఉచిత డేటా అందిస్తోంది.

రూ.149తో రీచార్జి ఆఫ‌ర్‌లో

కాగా, ఇంత‌కు ముందు ఉన్న ఆఫ‌ర్ రూ.149తో రీచార్జి ఆఫ‌ర్‌లో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. ఈ రీచార్జ్‌తో 2 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ 28 రోజుల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Summer Surprise: What are the benefits read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot