జియో బంపరాఫర్, అదనంగా 10జిబి డేటా

Written By:

జియోకి ధీటుగా టెల్కోలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో జియో కూడా సవాల్ కి సిద్ధమైంది. రిలయన్స్‌ జియో తన ప్రైమ్‌ మెంబర్లకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. రూ.303తో రీచార్జ్ చేసుకునే ప్రైమ్ మెంబర్లకు 4జీ వేగంతో అదనంగా 5జీబీ డాటాను అందించనున్నట్లు ప్రకటించింది. గతంలో ప్రకటించిన ఈ స్కీమ్ కింద 4జీ వేగంతో 28జీబీ డాటా లభించేది. ఇప్పుడు అదనంగా 5జిబిని యాడ్ చేసింది.

జియోకి సవాల్..రూ.346కే 28 జిబి 4జీడేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కోసం

ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కోసం ప్రస్తుత కస్టమర్లు 99 రూపాయల వన్‌టైమ్‌ చార్జీని చెల్లించాలి.

303 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే

ఆ తర్వాత 303 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 1జిబి చొప్పున (28 జిబి) 4జి వేగంతో డేటా లభిస్తుంది.

వేగం మాత్రం 128 కెబిపిఎస్‌కు

రోజువారీ పరిమితి మించిన తర్వాత కూడా డేటాకు ఎలాంటి చార్జీ ఉండదు. కానీ వేగం మాత్రం 128 కెబిపిఎస్‌కు తగ్గిపోతుంది. ఇలాంటి తరుణంలో 5జిబి డేటా అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

499 రూపాయలు అంతకు మించి రీచార్జ్‌ చేసుకుంటే

499 రూపాయలు అంతకు మించి రీచార్జ్‌ చేసుకుంటే 10జిబి అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌ కింద 28 రోజుల కాలపరిమితితో 56 జిబిల డేటా (రోజుకు 2జిబి పరిమితి)ను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

తొలి నెలకు మాత్రమే

అయితే అదనంగా ఇచ్చే డేటా తొలి నెలకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio sweetens Prime membership offer, adds extra 5GB free data read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot