జియోకి మళ్లీ క్లీన్ చిట్, ఖంగుతిన్న దిగ్గజాలు
టెలికం దిగ్గజాలు జియో ఉచిత ఆఫర్ పై చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది.
టెలికం దిగ్గజాల మధ్య నడుస్తున్న వార్ లో జియో మళ్లీ విజయం సాధించింది. టెలికం దిగ్గజాలు జియో ఉచిత ఆఫర్ పై చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ రెండు ఆఫర్లు వేరు వేరని రెండింటికి సంబంధం లేదని ట్రాయ్ తేల్చి చెప్పింది. ఇప్పుడు జియో ఉచితానికి అడ్డంకులు తొలగిపోయాయి. అయితే వొడాఫోన్ వేసిన కేసులో జియోకి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

టెల్కోలకు షాక్
రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీ తారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వడం సాధ్యం కాదని వాదించిన టెల్కోలకు షాకిస్తూ ట్రాయ్ జియోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అవి రెండు వేరు వేరు
జియో ప్రకటించిన వెల్‌కం ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండూ ఫండమెంటల్ గా వేరువేరు అని తేల్చి చెప్పింది. కాబట్టి వినియోగదారులు ఉచిత డేటా, వాయిస్ సేవలు మార్చి 31, 2017 వరకు పుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు.

తాజా ఆదేశాలు జారీ
రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని గతంలో ప్రకటించిన ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రాయ భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ సహా ఇతర ఆపరేటర్లకు ఈ సమాచారాన్ని ట్రాయ్ అందించనుంది.

ఎయిర్‌టెల్, ఐడియా అభ్యంతరం
కాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకాం తాజా ఆఫర్ పై టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, ఐడియా అభ్యంతరం వ్యక్తం చేశాయి.

భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్
ముఖ‍్యంగా భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ రిలయన్స్ జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా శాశ్వత కాలం ఫ్రీగా ఇవ్వడం సాధ్యం కాదనీ దీన్ని నిరోధించాలంటూ టెలికాం ట్రిబ్యునల్ (టీడీఎస్‌ఏటి) ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








