జియో ఉచితానికి ముప్పు..

Written By:

జియో రాకతో టెలికం మార్కెట్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేకెత్తిన సంగతి తెలిసిందే. జియో ఉచిత ఆఫర్‌తో అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న దిగ్గజ టెలికం కంపెనీలు ఒక్కసారిగా కుప్పకూలి ఇప్పటికీ కోట్ల కష్టాలతో నడుస్తున్నాయి. ఉచిత ఆఫర్ ఎలా ఇస్తారంటూ ఇప్పటికీ టెలికం కంపెనీలు ట్రాయ్‌కి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. ట్రాయ్ జియో వైపు మొగ్గు చూపడంతో కంపెనీలు కోర్టు మెట్లక్కాయి. ముఖ్యంగా వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో వొడాఫోన్ నెగ్గితే జియో ఉచితానికి ముప్పు ఉన్నట్లే.

ట్రంప్‌పై పోరాటం, చరిత్రలో తొలిసారిగా ఏకమైన టెక్ దిగ్గజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోపై ఢిల్లీ హైకోర్టులో కేసు

జియో వల్ల ఎక్కువగా నష్టపోయిన ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాంటి కంపెనీలు జియోపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసాయి. ట్రాయ్ కూడా జియోకే వంత పాడుతుందంటూ ట్రాయ్ మీద ఈ కంపెనీలు మండిపడ్డాయి.

మరోసారి విచారణకు

జియో ఫ్రీ టారిప్ ప్లాన్స్‌పై ఇంతకు ముందు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ మరోసారి విచారణకొచ్చింది. ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా రిలయన్స్ జియోకు అనుమతులిచ్చిందని ఎయిర్‌టెల్ ప్రధాన ఆరోపణ చేసింది.

ట్రాయ్ స్పందన

దీనిపై ట్రాయ్ స్పందిస్తూ జియోకు అనుమతులిచ్చే విషయంలో ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదని ట్రాయ్ కోర్టుకు తెలిపింది. అయితే జియో ఫ్రీ ఆఫర్‌కు ఏ పరిధిలో అనుమతులిచ్చారనే విషయాన్ని ట్రాయ్ కోర్టులో బహిర్గతం చేయలేదు.

వొడాఫోన్

ట్రాయ్ టారిఫ్ ఆర్డర్స్‌ను తుంగలో తొక్కి జియో ఈ ఫ్రీ ఆఫర్‌ను తీసుకొచ్చిందని, ట్రాయ్ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదని వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 

మొదటి నుంచి మెతక వైఖరి

ట్రాయ్ జియో విషయంలో మొదటి నుంచి మెతక వైఖరి అవలంబిస్తోందని, న్యూ ఇయర్ ఆఫర్ అనే పేరుతో ఫ్రీ టారిఫ్‌ను పొడిగించినా మిన్నకుండిపోయిందనేది ఇతర టెలికాం కంపెనీల ప్రధాన ఆరోపణ.

ఫిబ్రవరి 6న విచారణకు

మళ్లీ ఈ కేసు ఫిబ్రవరి 6న విచారణకు రానుంది. ఒకవేళ ఈ కేసులో వొడాఫోన్ నెగ్గితే జియో ఫ్రీ టారిఫ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోక తప్పదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Have taken a decision on free offers of RJIO: TRAI to HC read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot