జియో దూకుడుతో యూజర్లకి పండగే : 6నెలల్లో 45వేల 4జీ నెట్‌వర్క్‌టవర్లు

Written By:

జియో అనుకున్నట్టుగానే సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకెళుతోంది. దిగ్గజ టెల్కోలు ఇంటర్ కనెక్టింగ్ పాయింట్ల విషయంలో తటస్థ వైఖరి అవలంభించడంతో ఇప్పుడు టవర్లను సొంతంగా నిర్మించుకోవాలని జియో అనుకుంటోంది. ఇందులో భాగంగా రానున్న ఆరునెలల కాలంలో 45 వేల టవర్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వాట్సప్ వీడియో కాల్‌ ఫీచర్‌ను పొందడం ఎలా..?( సింపుల్ ట్రిక్స్ )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్తగా 45,000 టవర్లు ఏర్పాటు

4 జీ నెట్వర్క్ సామర్థ్య విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో రానున్న ఆరు నెలల కాలంలో కొత్తగా 45,000 టవర్లు ఏర్పాటు చేయనుంది. టెలికం మంత్రి మనోజ్ సిన్హాను కలుసుకొని టవర్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలు తెలిపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

రూ.లక్ష కోట్ల వ్యయం

వచ్చే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లను వ్యయం చేయనున్నామని, టవర్ల ఏర్పాటు కూడా ఇందులో భాగంగా ఉటుందని ముకేశ్ అంబానీకి చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో వర్గాలు వెల్లడించాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తుపై నియంత్రణ మండలి వర్గాలు

అయితే ఈ టవర్ల ఏర్పాటుకు సంబంధించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) నుంచి వచ్చిన దరఖాస్తుపై నియంత్రణ మండలి వర్గాలు స్పందించలేదు.

2.82 లక్షల టవర్లను ఏర్పాటు చేయడానికి

ఇప్పటికే జియో 2.82 లక్షల టవర్లను ఏర్పాటు చేయడానికి రూ .1.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.

ఇంటర్‌కనెక్టింగ్ వివాదం

టెలికం దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలతో ఇంటర్‌కనెక్టింగ్ వివాదం కారణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

రూ .3,050 కోట్ల జరిమానా

ఇందులో భాగంగానే టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ..ఈ మూడు దిగ్గజాలపై రూ .3,050 కోట్ల జరిమానా విధించాలని సూచించింన విషయం విదితమే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to install 45,000 mobile towers in 6 months read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot