జియో మరో సంచలనం, ఈ నెల 15న ముహూర్తం

|

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన కస్టమర్లకు మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశంలోనే తొలి జీరో కాస్ట్‌ పోస్ట్‌ పెయిడ్‌ సర్వీసులను ప్రకటించింది. రిలయన్స్‌ జియో సరికొత్త పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ 'జీరో టచ్‌'ను అందుబాటులోకి తెచ్చింది. ఒకే ఒక్క క్లిక్‌తో ఇంటర్నేషనల్‌ కాలింగ్‌ యాక్టివేషన్​ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎలాంటి నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే అంతర్జాతీయ కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే భారీ మొత్తంలో డేటాను కూడా అందిస్తోంది.

 
OPERATORRENTALBENEFITS
DATALOCAL & STD, ROAMING CALLSSMSISD CALLSINTERNATIONAL ROAMINGOTHER BENEFITS
Jio₹ 19925GBFreeFreePre-Activated
(Calls starting at 50p/min)
1 click activation at Zero Cost (Unlimited Credit Limit enhancement)FREE SUBSCRIPTION TO ALL JIO APPS
Airtel₹ 39920GBFreeFreeConsent to be provided by customerIR Activation chargeable at Rs.149/ monthWYNK MUSIC ONLY
Vodafone₹ 39920GBFree-Consent to be provided by customerIR Activation chargeable at Rs.149/ monthVODAFONE PLAY ONLY
Idea₹ 38920GBFree (But Roaming Calls Chargeable)FreeSecurity Deposit of Rs.1000IR Activation chargeable at Rs.149/ month and Additional Security deposit of Rs.2000IDEA APPS

BSNL మరో సంచలనం, రూ. 39కే అపరిమిత కాల్స్

రూ.199 ప్లాన్‌

రూ.199 ప్లాన్‌

రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం రూ.199 ప్లాన్‌ను పరిచయం చేసింది.జీరో-టచ్ పేరుతో వచ్చిన ఇందులో కస్టమర్లకు నెలకు 25జీబీ డాటాతోపాటు అంతర్జాతీయ కాలింగ్, రోమింగ్ ప్రయోజనాలు అందనున్నాయి.

ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌, సెక్యూరిటీ డిపాజిట్లు ..

ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌, సెక్యూరిటీ డిపాజిట్లు ..

అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలను కల్పిస్తున్న ఈ ప్లాన్‌ మే 15నుంచి అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో జియో తెలిపింది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌, సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది.

నిమిషానికి కేవలం 50 పైసల చొప్పున..
 

నిమిషానికి కేవలం 50 పైసల చొప్పున..

ఈ ప్లాన్‌లో అమెరికా, కెనడా కాల్స్‌కు నిమిషానికి కేవలం 50 పైసల చొప్పున చార్జ్ చేస్తున్న జియో.. బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజీలాండ్, సింగపూర్, బ్రిటన్‌లకు రూ.2, హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియా, టర్కీలకు రూ.3లను చొప్పున ఆఫర్ చేస్తోంది.

థాయిలాండ్‌లకు రూ.4..

థాయిలాండ్‌లకు రూ.4..

ఆస్ట్రేలియా, బహ్రెయిన్, పాకిస్తాన్, థాయిలాండ్‌లకు రూ.4, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, కువైట్, రష్యా, వియత్నాంలకు రూ.5, ఇజ్రాయెల్, నైజీరియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యూఏఈ, ఉజ్బెకిస్తాన్‌లకు రూ.6 చొప్పున తీసుకుంటున్నది.

ఒకరోజు కాలపరిమితితో..

ఒకరోజు కాలపరిమితితో..

ఇదిలావుంటే ఒకరోజు కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్ (భారత్‌తోపాటు విదేశాల్లో లోకల్ కాల్స్), ఎస్‌ఎమ్‌ఎస్, 250ఎంబీ హై-స్పీడ్ డాటా సౌకర్యం పొందాలంటే రూ.575 చెల్లించాలని జియో తెలిపింది.

7, 30 రోజులకు..

7, 30 రోజులకు..

అలాగే 7 రోజులకు అపరిమిత వాయిస్ కాల్స్ (భారత్‌తోపాటు విదేశాల్లో లోకల్ కాల్స్), ఎస్‌ఎమ్‌ఎస్ ల కోసం రూ.2,875, 30 రోజులకు అపరిమిత వాయిస్ కాల్స్ (భారత్‌తోపాటు విదేశాల్లో లోకల్ కాల్స్), ఎస్‌ఎమ్‌ఎస్ రూ.5,751 ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.అయితే 30 రోజుల ప్లాన్‌లో రోజుకు 5జీబీ డాటా వస్తుందని చెప్పింది.

 రెండు టారీఫ్‌లలో..

రెండు టారీఫ్‌లలో..

అంతర్జాతీయ రోమింగ్‌ను కూడా రెండు టారీఫ్‌లలో అందుబాటులోకి తెచ్చిన జియో ఒక టారీఫ్‌లో వాయిస్ కాల్స్ నిమిషానికి రూ.2, మొబైల్ డాటా ఎంబీకి రూ.2, ఒక్కో మేసేజ్‌కి రూ.2 చొప్పున చార్జ్ చేస్తామని వివరించింది. మరో టారీఫ్‌లో వీటికి రూ.10 చొప్పున తీసుకుంటామని స్పష్టం చేసింది.

309 రూపాయల నుంచి..

309 రూపాయల నుంచి..

ప్రస్తుతం జియో పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ 309 రూపాయల నుంచి ప్రారంభం అవుతోంది. ఇక 199 రూపాయల ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్లు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.

Best Mobiles in India

English summary
Jio to launch ‘Zero-Touch’ postpaid plan with unlimited benefits at Rs 199 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X