రిలయన్స్ జియో vs ఎయిర్‌టెల్ :పోల్చి చూస్తే..

Written By:

రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్లు ప్రకటించడంతో ఒక్కసారిగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేడెక్కింది. డేటా ఛార్జీలు అలాగే వాయిస్ కాల్స్, ఎసెమ్మెస్‌ల ప్లాన్లు అన్నీ జియో ప్రకటించడంతో ఇప్పుడు మిగతా టెల్కోలు దానికి ధీటుగా సరికొత్త ఆఫర్లను ప్రకటించే పనిలో పడ్డాయి. 2003లో వచ్చిన రిలయన్స్ విప్లవం జియోతో మళ్లీ ఇప్పుడు రిపీటయింది. ఇప్పుడు మార్కెట్లో మెజారిటీ వాటాల్లో రిలయన్స్ ,భారతి ఎయిర్‌టెల్ మాత్రమే ఉన్నాయి. అయితే ఈ రెండింటి టారిఫ్ ప్లాన్లను పోల్చి చూస్తే ఏది బెస్ట్ అనేది ఇట్టే తెలిసిపోతుంది.

Mobiles, Laptops, Apple

ముఖేష్ అంబాని భవిష్యత్ వ్యూహంతో పాటు జియో హైలెట్ పాయింట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ టారిఫ్ ప్లాన్స్

రిలయన్స్ జియో టారిప్ ప్లాన్లు రూ. 50 నుంచి మొదలవుతున్నాయి.10 జిబి 4జీ డేటాను వన్ మంత్ వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. అదే ఎయిర్ టెల్ కంపెనీ 1 జిబి 4జీ డేటాను రూ. 259లకు అందిస్తోంది. ఇక వొడాఫోన్ కూడా 1 జిబి 3జి డేటాను రూ. 252 కు అందిస్తోంది. వీటిల్లో రిలయన్స్ ప్లాన్ బెస్ట్‌గా నిలిచింది.

భారతి ఎయిర్ టెల్ 1 ఇయర్ 4జీ ప్లాన్

ఈ మధ్య భారతి ఎయిర్ టెల్ వన్ ఇయర్ టారిఫ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. రూ. 1498 తో రీ ఛార్జ్ చేసుకుంటే 1 జిబి 3 జీ డేటాను కేవలం రూ. 51కే పొందవచ్చు. అది ఎన్ని సార్లయినా మీరు రీ ఛార్జ్ చేసుకోవచ్చు.

రిలయన్స్ మంత్లీ ప్లాన్

రిలయన్స్ నుంచి వచ్చిన ఈ ఆఫర్ వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది. రూ. 400తో రీఛార్జ్ చేసుకుంటే 60 4జిబి డేటాను 30 రోజుల వ్యాలిడితో పొందవచ్చు.

ఎయిర్‌టెల్ మంత్లీ డేటా ఆఫర్

ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడితో దాదాపు 20 జిబిని కష్టమర్లకు అందిస్తోంది. దీని ధర రూ. 1989.ఈ ప్లాన్‌లో రిలయన్స్ మాత్రమే కష్టమర్ల మనసు గెలుచుకుంది.

వాయిస్ కాల్స్ ,ఎసెమ్మెస్ ప్లాన్స్

రిలయన్స్ జియో మంత్లీ ప్యాకేజిలోనే వాయిస్ కాల్స్ అలాగే ఎసెమ్మెస్‌లను అందిస్తోంది. అయితే మిగతా టెల్కోలు మాత్రం వీటికి సపరేట్‌గా ఛార్జ్ చేస్తున్నాయి.

విన్నర్

ఇది చాలా సింపుల్ ఈ సెగ్మెంట్ లో రిలయన్స్ జియోనే విజయం సాధించింది. సెప్టెంబర్ 5 నుంచి జియో సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మిగతా టెల్కోలో ఏ మేరకు టారిప్ ప్లాన్లను తగ్గిస్తాయో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Reliance Jio vs Airtel 4G: Tariff Plans Compared
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot