ముఖేష్ అంబాని భవిష్యత్ వ్యూహంతో పాటు జియో హైలెట్ పాయింట్స్

By Hazarath
|

ముంబైలో కొద్ది సేపటి క్రితం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్యసమావేశం మళ్లీ ఎన్నికలు వస్తున్నాయా అన్నట్లుగా నడిచింది. మొబైల్ రంగంలోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ అధినేత జియోకు అధికారికంగా రిబ్బన్ కట్ చేశారు. రిబ్బన్ కట్ చేయడమే ఆలస్యం ఉచిత మంత్రాన్ని జపించారు.

కొత్త ఫోన్ కొనాలనుకునేవారు ఇక్కడ ఆగండి

mukesh ambani

ఈ నెల 5వ తేదీ నుండి డిసెంబర్ వరకు జియో మొబైల్ సేవలు పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నారు. ఇక 50 రూపాయలకే 1 జిబి డేటాను అందిచనున్నట్లు చెప్పిన ముఖేష్ అంబాని విద్యార్థులకు వరాల జల్లును ప్రకటించారు. వారికి అదనంగా మరో 25 శాతం డేటాను అందిస్తామని చెప్పారు. మొత్తంగా రిలయన్స్ సర్వసభ్య సమావేశం ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. మీటింగ్ లోని హైలెట్ పాయింట్స్ ఇవే..

అత్యంత తక్కువ ధరలకే 4జీ స్మార్ట్‌ఫోన్లు

నంబర్ ఆఫ్ టారిఫ్ ప్లాన్స్

నంబర్ ఆఫ్ టారిఫ్ ప్లాన్స్

టెలికం తరీఫ్ ప్లాన్ ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా అర్థం చేసుకునే విధంగా ఉంటుందని ముఖేష్ అంబాని చెప్పారు. ఇప్పటిదాకా దేశంలో 22వేలకు పైగానే తరీఫ్ ప్లాన్లు ఉన్నాయని అయితే జియో మాత్రం 10 ముఖ్యమైన ప్లాన్లను అందిస్తుందని సర్వసభ్య సమావేశంలో ఆయన తెలిపారు.

19 రూపాయల నుంచి మొదలు

19 రూపాయల నుంచి మొదలు

జియో డేటా ధరలు 19 రూపాయల నుంచి మొదలై నెలకు 149 రూపాయల దాకా ఉంటాయని చెప్పారు. కార్పోరేట్ వినియోగదారులకి నెలకి రూ. 4999 ప్లాన్ కూడా ఉందని తెలిపారు. వారు దీన్ని వినియోగించుకుని అనేక బెనిఫిట్స్ కూడా పొందవచ్చని ముఖేష్ అంబాని అన్నారు.

వాయిస్ కాల్స్
 

వాయిస్ కాల్స్

ఏజిఎమ్ మీటింగ్ లో ముఖేష్ అంబాని మాట్లాడుతూ వాయిస్ కాల్స్ కి కష్టమర్లు ఎటువంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదని ఇది పూర్తిగా ఉచితమని తెలిపారు. రోమింగ్ ఛార్జీలు కూడా లేవని స్పష్టం చేశారు.

డేటా ప్లాన్స్

డేటా ప్లాన్స్

ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న డేటా తరీప్ లను పరిశీలిస్తే 1 జిబి దాదాపు 250 దాకా ఉంది. అయితే జియో కష్టమర్లు ఈ ధరతో 5 నుంచి 10 సార్లు డేటాను వాడుకోవచ్చు. వారు కేవలం 1 జిబి డేటాను 25 నుంచి 50 రూపాయల మధ్యలో చెల్లిస్తే చాలు.

ఫ్యూచర్ టెక్నాలజీ

ఫ్యూచర్ టెక్నాలజీ

జియో నెట్ వర్క్ 18వేల నగరాలను అలాగే పట్టణాలను కవర్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇది మార్చి 2017 నాటికి దాదాపు 2 లక్షల గ్రామాలను కవర్ చేస్తుందని అంచనా. ఇండియాలో దాదాపు 90 శాతం మందికి జియో చేరాలన్నదే ముఖేష్ అంబానీ ధ్యేయంగా తెలుస్తోంది. ఫ్యూచర్ లో ఇది 5జీ ,6జీ టెక్నాలజీకి కూడా పనికి వచ్చే విధంగా ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టారు. 4జీ నుంచి 5జీ ,6జీ డేటా అడ్వాన్స్ గా వాడుకునే విధంగా సరికొత్త ప్రణాళికలను రచించనున్నారు.

హ్యాండ్ సెట్

హ్యాండ్ సెట్

ఇప్పటికే రిలయన్స్ 4జీ హ్యాండ్ సెట్లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఇవి రూ. 2999 నుంచి స్టార్టవుతున్నాయి. జియో Fi కేవలం 1999 రూపాయలకే లభిస్తోంది. జియో స్ట్రాంగ్ నెట్ వర్క్ తో ఈ ఫోన్లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ 31 2017 వరకు పూర్తిగా ఉచితమని ఆ తర్వాత రూ 15వేలతో జియో యాప్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అంబాని తెలిపారు.

విద్యార్థులకు రాయితీ

విద్యార్థులకు రాయితీ

ముఖేష్ అంబాని విద్యార్థులకు వరాల జల్లును ప్రకటించారు. వారికి అదనంగా మరో 25 శాతం డేటాను అందిస్తామని చెప్పారు. డిసెంబర్ 31 వరకూ ఉచిత డేటా, వాయిస్, వీడియో, ఆప్స్ సేవలను అందుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకూ ఎలాంటి చార్జీలనూ వసూలు చేయబోమని, ఆపై కూడా కేవలం రూ. 50 కే 1 జీబీ డేటాను పొందవచ్చని ఆయన తెలిపారు.

e-KYC

e-KYC

e-KYC ద్వారా జియో కనెక్షన్ కేవలం 15 నిమిషాల్లోనే పొందవచ్చు. ఇంట్లో కాని లేకుంటే షో రూం దగ్గర కాని డిజిటల్ యాక్టివేషన్ చాలా ఫాస్ట్ గా పొందవచ్చు.

డిజిటల్ ఫండ్

డిజిటల్ ఫండ్

ఇండియాను డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని ముఖేష్ అంబాని తెలిపారు. ప్రధాన నగరాల్లో Digital Entrepreneurship Hubs అలాగే డిజిటల్ స్టార్టప్ లకు జియో డోర్లు తెరిచే ఉంటాయని చెప్పారు.

యువతరానికి ఆహ్వానం

యువతరానికి ఆహ్వానం

జియో యువతరానికి ఆహ్వనం పలుకుతోంది. డిజిటల్ వెంచర్ కోసం అలాగే entrepreneurs కోసం త్వరలో జియో నోటిఫికేషన్ వెలువరించే అవకాశం కూడా ఉంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా రిలయన్స్ జియో అఫీషియల్ లాంచ్ ని సెప్టెంబర్ 5 వ తేదీ నుంచి అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. 

ప్యాకేజీల పూర్తి వివరాలు: ఎస్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 149

ప్యాకేజీల పూర్తి వివరాలు: ఎస్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 149

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 0.3 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి సిగ్నల్స్ ఈ ప్యాకేజీకి వర్తించవు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (1) ప్యాకేజీ: టారిఫ్ రూ. 499.

ఎం (1) ప్యాకేజీ: టారిఫ్ రూ. 499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 4 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 8 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (2) ప్యాకేజీ: టారిఫ్ రూ. 999.

ఎం (2) ప్యాకేజీ: టారిఫ్ రూ. 999.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 10 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 20 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 1499.

ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 1499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 20 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 40 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 2499.

ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 2499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 35 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 70 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 3499.

ఎక్స్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 3499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 60 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 120 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ట్రిపుల్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 4499.

ట్రిపుల్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 4499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 75 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 150 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

జియో ప్రీమియం యాప్స్

జియో ప్రీమియం యాప్స్

ఈ ప్యాకేజీల్లో భాగంగా జియో ప్రీమియం యాప్స్ డిసెంబర్ 31 2017 వరకూ ఉచితంగా వాడుకోవచ్చు. డేటా ప్యాక్ ల విషయంలో మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ 31 తరువాత తమ టారిఫ్ ప్లాన్ ను కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Here Write Reliance Jio 4G services announced: Highlights

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X