జియోకి ఝలక్ ఇస్తున్న ఎయిర్‌టెల్ ఆఫర్లు !

Written By:

ఈ మధ్య కొద్ది రోజుల నుంచి రిలయన్స్ జియో ఎయిర్‌టెల్‌పై మండిపడుతున్న సంగతి తెలిసిందే. టారిఫ్ రూల్స్ ను తీవ్రంగా ఉల్లంఘిస్తూ తప్పుదోవ పట్టించే ఆఫర్లను ఎయిర్ టెల్ తీసుకొస్తుందని జియో భారీగా మండిపడుతోంది. తన కస్టమర్ల మధ్య ఏకపక్ష వివక్షతను తీసుకొస్తుందని పేర్కొంటోంది. మరి ఎందుకు అలా మండిపడుతోంది. ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోకి పోటీగా ఎయిర్‌టెల్

జియోకి పోటీగా ఎయిర్‌టెల్ రెండు ఆఫర్లను కష్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఈ ఆఫర్లే రూ.293, రూ.449. ఇవి తప్పుడు ధోరణిలో ఉన్నాయని, వీటికి సంబంధించి టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్, భారతీ ఎయిర్‌టెల్ పై భారీ జరిమానా విధించాల్సిందేనని పట్టుబడుతోంది.

రూ. 293 ఆఫర్ విషయానికొస్తే.. ( 4జీ హ్యండ్ సెట్ )

ఈ ప్లాన్ ప్రకారం కష్టమర్ నెలరోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ అలాగే అన్ లిమిటెడ్ ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతో పాటు 1 జిబి డేటా డైలీ వినియోగదారునికి లభిస్తుంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది.

ఇతర హ్యాండ్ సెట్లు

ఈ ప్లాన్ ప్రకారం కష్టమర్ నెలరోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ అలాగే అన్ లిమిటెడ్ ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతో పాటు 1 జిబి డేటా డైలీ వినియోగదారునికి లభిస్తుంది. ఇది 35 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది.

రూ. 449 ఆఫర్ విషయానికొస్తే.. ( 4జీ హ్యండ్ సెట్ )

ఈ ప్లాన్ ప్రకారం కష్టమర్ నెలరోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ అలాగే అన్ లిమిటెడ్ ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతో పాటు 1 జిబి డేటా డైలీ వినియోగదారునికి లభిస్తుంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది.

ఇతర హ్యాండ్ సెట్లు

ఈ ప్లాన్ ప్రకారం కష్టమర్ నెలరోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ అలాగే అన్ లిమిటెడ్ ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతో పాటు 1 జిబి డేటా డైలీ వినియోగదారునికి లభిస్తుంది. ఇది 35 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది.

కష్టమర్లను ఆకర్షించడానికి

కష్టమర్లను ఆకర్షించడానికి ఈ ఆఫర్లపై 70 రోజుల వరకు రోజుకు 1జీబీ డేటాను అందిస్తున్నట్టు చెప్పిందని, కానీ కేవలం 50ఎంబీ డేటాను మాత్రమే ఎయిర్ టెల్ అందిస్తుందని జియో పేర్కొంటోంది. సబ్ స్క్రైబర్లు ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్స్ కు తృప్తి చెందడం లేదని చెబుతోంది.

ఘోరమైన వివక్ష ఆధారంగా

ఘోరమైన వివక్ష ఆధారంగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుందని జియో ఆరోపిస్తోంది. 4జీ హ్యాండ్ సెట్, 4జీ సిమ్ లేని సబ్ స్క్రైబర్లకు ఎయిర్ టెల్ ఆ ప్లాన్స్ పై అందిస్తున్న డేటా ప్రయోజనాలను ఏకపక్షంగా తగ్గిస్తుందట. ఇది టారిఫ్ ఆర్డర్ 1999కు ఉల్లంఘన అని జియో పేర్కొంటోంది. జియో చేస్తున్న ఆరోపణలను టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ఖండిస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio vs Airtel offer war: Here’s why they are fighting over Rs 293 and Rs 449 tariff plans Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot