Jio VS Airtel: రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఏది?
భారతదేశంలో అతి పెద్ద టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ సంస్థలు రెండూ కూడా తరచూ పోటీ పడుతున్నాయి. ఈ రెండు కంపెనీల యొక్క పోటీలో భాగంగా ఎక్కువ మంది చందాదారులను చేర్చుకోవాలని మరియు అతి పెద్ద మార్కెట్ వాటాను పొందాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసం జియో మరియు ఎయిర్‌టెల్ రెండూ తమ యొక్క వినియోగదారులకు తక్కువ-ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

తక్కువ-ధర వద్ద లేదా ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.200 లోపు లభిస్తాయి. జియో టెల్కో రూ.200 ధర లోపు రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు వరుసగా 149 రూపాయలు, 199 రూపాయలు ధరను కలిగి ఉన్నాయి. మరోవైపు ఎయిర్‌టెల్ కూడా తన యొక్క వినియోగదారులకు రూ.200 లోపు బహుళ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు రూ.19 నుండి రూ.199 వరకు ఉంటాయి. ఈ ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలను గమనించి ఏ కంపెనీ తక్కువ ధర వద్ద మంచి ఆఫర్‌లను అందిస్తుందో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

తక్కువ ధర వద్ద లభించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో టెల్కో కంపెనీ తక్కువ ధర వద్ద అదే రూ.200 ధర లోపు రెండు ప్లాన్‌లను మాత్రమే అందిస్తుంది. ఇందులో మొదటి ప్లాన్ రూ.149 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 1GB డైలీ డేటా, రోజుకు 100SMS ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

రూ.199 ధర వద్ద లభించే ప్లాన్‌లో 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని 28 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లను కూడా అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లలో జియో యొక్క అన్ని యాప్ లకు (JioTV, JioSecurity, JioCinema, JioNews మరియు JioCloud) కాంప్లిమెంటరీ చందా ఉంటుంది.

తక్కువ ఖర్చుతో లభించే భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
భారతి ఎయిర్‌టెల్ వినియోగదారులు తక్కువ-ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం చూస్తున్న వారికి అనేక ఎంపికలు లభిస్తాయి. రూ.200 ధర లోపు వచ్చే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.19, రూ .129, రూ .149, రూ .179, రూ.199 ధరల వద్ద లభిస్తాయి. రూ.19 ధర వద్ద లభించే చౌకైన ప్లాన్ 200MB డేటాతో 2 రోజుల చెల్లుబాటు కాలానికి వస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను పొందుతారు. ఇందులో ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్‌లతో పాటు SMS ప్రయోజనాలు ఏవి లేవు.

రూ.129 ధర వద్ద లభించే ప్లాన్‌ను ఎంచుకున్న వారికి 24 రోజుల చెల్లుబాటు కాలానికి 1GB మొత్తం డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 SMSలు ఉన్నాయి. అలాగే రూ.149 ధర వద్ద లభించే ప్లాన్‌లో 2GBu డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. రూ.149 మరియు రూ.179 ప్లాన్ ప్రయోజనాల మధ్య ఒకే ఒక తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే రూ.179 ప్లాన్ భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ నుండి రూ.2 లక్షల బీమా ఆఫర్‌తో వస్తుంది.

చివరగా టెల్కో నుండి రూ.199 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు 1GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS / day ప్రయోజనాలతో 24 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. పైన పేర్కొన్న అన్ని ఎయిర్‌టెల్ ప్లాన్‌లు (రూ.19 ప్లాన్‌ను మినహాయించి) ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలతో మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క 1 నెల ఉచిత ట్రయల్‌తో వస్తాయని గమనించండి.

తక్కువ ధర వద్ద లభించే ప్లాన్‌లలో బెస్ట్ ఏది?
తక్కువ-ధర లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మెరుగైన ఫీచర్లను అందించే టెల్కో జియో మాత్రమే. అధిక డేటా ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం చూస్తున్న వినియోగదారుల పరంగా ఇది శ్రేష్ఠమైనది. అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMSతో 1GB రోజువారీ డేటాను కోరుకుంటే వారు జియో యొక్క రూ.149 ను పొందవచ్చు. ఎయిర్టెల్ ఇదే ప్లాన్ ను రూ.199 ధర వద్ద అందిస్తుంది. ఇది చాలా ఖరీదైనది.


Click it and Unblock the Notifications