Tata Sky Broadband Vs Airtel Xstream Fiber: 200 Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే

|

ఇండియాలో కరోనా వ్యాప్తి తరువాత చాలా మంది ఇంటి వద్ద నుండి పనిచేయడంతో వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ యొక్క వినియోగ విధానం నేడు పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు వినియోగదారులు 10 Mbps వేగంతో మరియు తక్కువ మొత్తంలో సరసమైన FUP డేటాతో సంతోషంగా ఉన్నారు. కానీ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్, జియోఫైబర్ వంటి ఇతర ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు (ISP లు) మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారాయి.

 

200Mbps ప్లాన్‌

యూజర్లు ఇప్పుడు తమ ఫైబర్ ప్లాన్‌లతో నెలవారీ FUP డేటాలో 1,000GB కంటే ఎక్కువ మొత్తాన్ని 100 Mbps వేగంతో కోరుకుంటారు. ఇంకా వారు డిఎస్ఎల్ ప్లాన్ల కోసం వచ్చే ఖర్చుతో దీనిని కోరుకుంటారు. కానీ కొంతమంది వినియోగదారులు తమ గేమింగ్ మరియు స్ట్రీమింగ్ అవసరాలను తీర్చడానికి 100 Mbps కన్నా ఎక్కువ వేగంతో కోరుకుంటారు. అటువంటి వారికి 200Mbps ప్లాన్‌లు సరిగ్గా సరిపోతాయి. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రెండూ కూడా 200 Mbps వేగంతో కొన్ని ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ రోజు మేము ఈ రెండు ISP ల యొక్క 200 Mbps ప్లాన్ లను పోల్చి చూస్తున్నాము. ఈ రెండిటిలో ఏది అధిక ప్రయోజనాలను అందిస్తున్నదో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 200 Mbps ప్లాన్
 

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 200 Mbps ప్లాన్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ తన 200 Mbps ప్లాన్‌ను నెలకు రూ.1,150 ధర వద్ద అందిస్తుంది. ఇది వేర్వేరు చెల్లుబాటు కాలాలలో కూడా లభిస్తుంది. 3 నెలల వాలిడిటీకి ఈ ప్లాన్‌కు రూ.3,300 ఖర్చవుతుంది. అంటే నెలకు రూ.1,100 ఖర్చు అవుతుంది. అలాగే 6 నెలల వాలిడిటీ కాలానికి దీనిని 5,550 రూపాయల ధర వద్ద పొందవచ్చు. అంటే దీనికి నెలవారి రూ.925 ఖర్చు అవుతుంది. చివరిగా దీనిని 12 నెలల చెల్లుబాటు కాలానికి రూ.10,200 ధర వద్ద పొందవచ్చు. అంటే నెలవారి ధర 850 రూపాయలు.

ఈ ప్లాన్ తో వినియోగదారులు 3.3TB లేదా 3,300GB నెలవారీ FUP డేటాను పొందుతారు. వినియోగదారు 1 నెల ప్లాన్ ను ఎంచుకుంటే కనుక వారు రూ.1,000 సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలి అయితే అది పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. ఇంకా టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు డ్యూయల్-బ్యాండ్ రౌటర్‌ను ఉచితంగా అందిస్తుంది. అలాగే కనెక్షన్ యొక్క ఇన్‌స్టాలేషన్ కోసం అదనంగా ఏమీ వసూలు చేయదు.

 

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 200 Mbps ప్లాన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 200 Mbps ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క 200 Mbps ప్లాన్ నెలకు రూ.999 ధర వద్ద లభిస్తుంది. కానీ ఇది 3, 6, మరియు 12 నెలల చెల్లుబాటులో కూడా లభిస్తుంది. 3 నెలల వాలిడిటీ కాలానికి కూడా వినియోగదారులకు నెలకు 999 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఒకేసారి రూ.2,997 పేమెంట్ చేయవలసి ఉంటుంది. 6 నెలల ప్లాన్ రూ.5,544 ధర వద్ద లభిస్తుంది. అంటే ఇది నెలవారి ధర రూ.924 లకు వస్తుంది. చివరగా 12 నెలల ప్లాన్ రూ .10,188 ధర వద్ద అంటే నెలకు రూ.849 ఖర్చుతో వస్తుంది.


ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క 200 Mbps ప్లాన్ లో 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్లాన్‌లపై సంస్థ ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను అందిస్తుంది. ఈ కనెక్షన్‌తో కంపెనీ డ్యూయల్-బ్యాండ్ రౌటర్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అందించే FUP డేటా నెలకు 3.3TB లేదా 3,333GB గా ఉంది. అలాగే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ VIP, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మరియు ఇతర ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

 

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ Vs టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్: తీర్పు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ Vs టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్: తీర్పు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అందించే ప్లాన్‌పై ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క 200Mbps ప్లాన్ కొద్దిగా మెరుగ్గా ఉంది. టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క 200 Mbps కనెక్షన్‌తో వినియోగదారులు ఉచిత వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ను ఎంచుకోవచ్చని గమనించండి. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క 200 Mbps ప్లాన్ OTT ప్రయోజనాలతో పాటు తక్కువ ధర వద్ద 33GB FUP డేటాను అదనంగా అందిస్తుంది. అదే సమయంలో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అందించే డేటా సమర్పణ ఏమాత్రం చెడ్డది కాదు. 200 Mbps ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ఒక సంస్థను ఎంచుకుంటే కనుక మేము ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌ను ఎంచుకుంటాము.

Best Mobiles in India

English summary
Tata Sky Broadband Vs Airtel Xstream Fiber 200 Mbps Plans: Which One is The Best

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X