జియో వర్సెస్ టెలికం ఇండస్ట్రీ: పోరులో గెలుపెవరిది..?

Written By:

మూడు నెలల పాటు 4జీ ఫ్రీ సర్వీస్ అంటూ రిలయన్స్ జియో ఇప్పుడు టెలికం రంగంలో చిచ్చు రేపింది. తమ వాణిజ్య సేవలు ప్రారంభించకుండా విలువైన 4జీ సేవలను ఉచితంగా ఇవ్వడం మిగతా కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని దిగ్గజ టెల్కోలు వాదిస్తున్నారు. అయితే జియో వాణిజ్య సేవలను మరికొన్నినెలల్లో ప్రారంభించబోతున్న తరుణంలో ఈ యుద్ధం పతాక స్థాయికి చేరింది. మాటల దాడితో మరింత పదునెక్కుతోంది.

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో వర్సెస్ టెలికం ఇండస్ట్రీ

మూడు నెల‌ల పాటు అంద‌రికీ హైస్పీడ్ 4జీ సేవ‌లు ఫ్రీ అంటూ సంచ‌ల‌నం రేపుతున్న రిల‌య‌న్స్ జియో ఇప్పుడు టెలికామ్ రంగంలో చిచ్చు రేపింది.

జియో వర్సెస్ టెలికం ఇండస్ట్రీ

టెలికాం రంగంలోకి పూర్తి స్థాయిలో ప్రవేశించకుండానే విలువైన 4జీ సేవలు ఉచితంగా ఇవ్వడం తమపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలాంటి ఇత‌ర ఆప‌రేట‌ర్లు వాదిస్తున్నారు.

జియో వర్సెస్ టెలికం ఇండస్ట్రీ

సిగ్న‌ల్ స్ట్రెంత్‌ను ప‌రిశీలించే పేరుతో త‌మ ఎయిర్‌వేవ్స్‌ను రిలయెన్స్ ఫ్రీగా వాడుకుంటోంద‌ని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలాంటి ఆప‌రేట‌ర్లు ఆరోపిస్తున్నారు.

జియో వర్సెస్ టెలికం ఇండస్ట్రీ

జియో పూర్తి స్థాయిలో బయటకు తీసుకురాకుండా కష్టమర్లను మభ్యపెడుతోందని చాలామందిని ఆకర్షిస్తోందని ఉచితం అనే ఆయుధాన్ని ప్రయోగించి ఆదాయాన్ని దెబ్బకొడుతోందని వారు వాదిస్తున్నారు.

జియో వర్సెస్ టెలికం ఇండస్ట్రీ

బీటా టెస్టింగ్ పేరుతో ఇలా విలువైన వాణిజ్య సేవలను ఇవ్వడం సరికాదని ఇది ప్రభుత్వ ఆదాయంపై తీరని ప్రభావం చూపుతుందని దీన్ని ఆపాలంటూ సీవోఏఐ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు కూడా చేసింది.

జియో వర్సెస్ టెలికం ఇండస్ట్రీ

అయితే ఇత‌ర ఆప‌రేట‌ర్లు, అసోసియేష‌న్ తీరును రిల‌యెన్స్ త‌ప్పుబడుతోంది. అసోసియేష‌న్ మిగ‌తా ఆప‌రేట‌ర్లను వెన‌కేసుకువ‌స్తోంద‌ని, దీనిపై తాము కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించింది.

జియో వర్సెస్ టెలికం ఇండస్ట్రీ

ప్ర‌భుత్వం దీనిపై ఇంకా స్పందించ‌లేదు. వివాదాన్ని ప‌రిష్క‌రించాల్సిందిగా టెలికామ్ రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించే అవ‌కాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Reliance Jio vs Telecom Industry: Jio's Battle of Supremacy so Far
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot