అదిరిపోయే షాక్ : ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపిన జియో

By Hazarath
|

ఈ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా యుద్ధానికి దిగిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య ఇప్పుడు స్నేహం కొత్త మొగ్గ తొడిగింది. రెండు కలిసి పనిచేయటానికి అంగీకరించాయి. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ , ఐడియా, వొడాఫోన్ తో చర్చలు జరిపిన రిలయన్స్ ఇప్పుడు ఎయిర్ టెల్ తో కూడా చర్చల్లో విజయం సాధించినట్లుగా తెలుస్తోంది.

అన్నతో తమ్ముడి వార్ : జియోని దెబ్బ కొట్టేందుకేనా..?

అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు

అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు

మొత్తం మీద రిలయన్స్ జియోకి అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు చేసేందుకు భారతి ఎయిర్‌టెల్ అంగీకరించింది. తాము ఏర్పాటుచేసే పోర్ట్‌లు జియో 1.5 కోట్ల మంది కస్టమర్ల కాల్స్‌ని సపోర్ట్ చేస్తాయని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

జియో యూజర్లు

జియో యూజర్లు

జియో యూజర్లు ఎయిర్‌టెల్ యూజర్లకు ఫోన్ చేసుకోవచ్చు. తాజా చర్యతో ప్రస్తుత పోర్టుల సంఖ్య 3 రెట్లు పెరుగుతుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.

ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెలికం కంపెనీలు

ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెలికం కంపెనీలు

ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెలికం కంపెనీలు తమకు ఇంటర్‌కనెక్ట్ పోర్ట్‌లను సక్రమంగా ఇవ్వడం లేదంటూ ఇటీవల ముకేశ్ అంబానీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీని కారణంగా అప్పుడు జియో 5 కోట్ల కాల్స్ ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు.

సమస్య పరిష్కారానికి ట్రాయ్ రంగంలోకి

సమస్య పరిష్కారానికి ట్రాయ్ రంగంలోకి

ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ట్రాయ్ రంగంలోకి దిగింది. దీంతో ఐడియా సోమవారం జియోకి అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే బాటలో ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా చేరింది. ఇదిలా ఉంటే జియో ఇప్పుడు టార్గెట్ రీచ్ కాలేక నానా అవస్థలు పడుతోంది.

త‌క్కువ ధ‌ర‌కే 4జీ డేటా ఆఫ‌ర్ల‌తో

త‌క్కువ ధ‌ర‌కే 4జీ డేటా ఆఫ‌ర్ల‌తో

ఫ్రీ వాయిస్ కాల్స్‌, త‌క్కువ ధ‌ర‌కే 4జీ డేటా ఆఫ‌ర్ల‌తో టెలికాం రంగంలో సంచ‌ల‌నాలు సృష్టించిన రిల‌యెన్స్ జియో ఇప్పుడు ఆశించిన మేర క‌స్ట‌మ‌ర్ల‌ను మాత్రం పొంద‌లేక‌పోతోంది.

రోజు ప‌ది ల‌క్ష‌ల మంది కొత్త క‌స్ట‌మ‌ర్ల‌తో

రోజు ప‌ది ల‌క్ష‌ల మంది కొత్త క‌స్ట‌మ‌ర్ల‌తో

రోజు ప‌ది ల‌క్ష‌ల మంది కొత్త క‌స్ట‌మ‌ర్ల‌తో ఈ ఏడాది చివ‌రికి ప‌ది కోట్ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న జియో దాన్ని అందుకోలేక ప్ర‌స్తుతం రోజుకు 5 ల‌క్ష‌ల మందే కొత్త‌గా జియో క‌నెక్ష‌న్ల‌ను అందిస్తూ వస్తోంది.

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అన్నీ ఉచిత‌మ‌ని ప్ర‌క‌టించినా.. కంపెనీకి ఊహించిన స్పంద‌న రావ‌డం లేదు. అదీగాక కష్టమర్లకు సిమ్ కార్డులు అందిచండంలో అలాగే వాటిని యాక్టివేట్ చేయడంలో జియో విఫలం చెందుతూ వస్తోంది.

ఎల‌క్ట్రానిక్ నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్

ఎల‌క్ట్రానిక్ నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్

ఇక ఎల‌క్ట్రానిక్ నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్ (ఈ-కేవైసీ) ద్వారా ఎక్కువ మంది కస్ట‌మ‌ర్ల‌ను చేర్చుకుంటామ‌ని అంబానీ ప్ర‌క‌టించినా అది ముంబై, ఢిల్లీ న‌గ‌రాల‌కే ప‌రిమితం కావ‌డంతో అంబానీ ల‌క్ష్యానికి కంపెనీ ఇప్పుడు దూరంగా ఉండిపోతోంది.

 జియో మొత్తం క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 50 ల‌క్ష‌లు

జియో మొత్తం క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 50 ల‌క్ష‌లు

ప్ర‌స్తుతం జియో మొత్తం క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 50 ల‌క్ష‌లు దాటిపోయింద‌ని కంపెనీ ఉద్యోగి ఒక‌రు వెల్ల‌డించారు. జియో వెల్‌క‌మ్ ఆఫ‌ర్ కింది రోజుకు ఐదు ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లు జియో క‌నెక్ష‌న్లు తీసుకుంటున్నార‌ని చెప్పారు.

3500 రిటెయిల్ ఔట్‌లెట్ల ద్వారా

3500 రిటెయిల్ ఔట్‌లెట్ల ద్వారా

ప్ర‌స్తుతానికి జియో 3500 రిటెయిల్ ఔట్‌లెట్ల ద్వారా కొత్త క‌స్ట‌మ‌ర్ల‌ను చేర్చుకుంటుండగా, ఈ ఔట్‌లెట్స్ ముందు రోజూ కిలోమీట‌ర్ల కొద్దీ క‌స్ట‌మ‌ర్లు బారులు తీరుతున్నారు.

ఈ-కేవైసీ క‌స్ట‌మ‌ర్లు

ఈ-కేవైసీ క‌స్ట‌మ‌ర్లు

ఈ-కేవైసీ క‌స్ట‌మ‌ర్లు ఆధార్ కార్డ్ అందిస్తే రెండు గంట‌ల్లో సిమ్ యాక్టివేట్ చేస్తామ‌ని, కానీ రిటెయిల్ ఔట్‌లెట్స్ ద్వారా వ‌చ్చే ల‌క్ష‌ల మంది సిమ్స్‌ను యాక్టివేట్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని మ‌రో సీనియ‌ర్ ఉద్యోగి చెబుతున్నారు.

సిమ్ తీసుకోవడానికి మూడు రోజులు

సిమ్ తీసుకోవడానికి మూడు రోజులు

మ‌రోవైపు సిమ్ తీసుకోవడానికి మూడు రోజులు, అది యాక్టివేట్ కావ‌డానికి మ‌రో రెండు, మూడు రోజులు వేచి చూడాల్సి వ‌స్తోంద‌ని క‌స్ట‌మ‌ర్లు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

మ‌రింత విస్తృతం చేయాల‌ని

మ‌రింత విస్తృతం చేయాల‌ని

దీంతో త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేయాల‌ని జియో భావిస్తోంది. టాప్ 8 సిటీస్‌కు ఈ-కేవైసీ సేవ‌ల‌ను విస్త‌రించాల‌ని చూస్తోంది. దీనిద్వారా రోజుకు ప‌ది ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను సునాయాసంగా ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది.

కంపెనీ ముందు ముందు ఈ వైఫల్యాలను

కంపెనీ ముందు ముందు ఈ వైఫల్యాలను

మరి కంపెనీ ముందు ముందు ఈ వైఫల్యాలను అధిగమించి ముకేష్ లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దాన్ని చేరుకోవాలని ఆశిద్దాం.

Best Mobiles in India

English summary
Reliance Jio will turn Ebitdar-positive only by 2019: Moody's read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X