Home
News

JioFiber బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొత్త ప్లాన్‌ల డేటా ఆఫర్స్ ఇవే...

రిలయన్స్ జియో సంస్థ టెలికామ్ రంగంలో మంచి విజయం సాధించిన తరువాత బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్టింది. బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ప్రవేశించడానికి ముందే దీని మీద ఊహాగానాలు అధికంగా ఉన్నాయి. జియోఫైబర్ పేరుతో బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగు పెట్టిన సంస్థ మొదట ఆఫర్ ధరల వద్ద డేటాను అందించింది.

జియోఫైబర్

ఇటీవల తన జియోఫైబర్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో కొన్ని మార్పులు చేసింది. ఈ కొత్త ప్లాన్‌లలో వార్షిక చందా ప్లాన్‌లపై ఇప్పుడు డబుల్ డేటాను అందిస్తున్నది. కొత్తగా అప్ డేట్ చేసిన ఈ ప్లాన్‌లు ఇప్పుడు కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. WhatsApp scam:వెరిఫికేషన్ కోడ్స్ పేరుతో మెసేజ్ వచ్చిందా!!!! జర జాగ్రత్త...

జియోఫైబర్ కొత్త ప్లాన్‌లు

జియోఫైబర్ కొత్త ప్లాన్‌లు

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం బ్రోన్జ్ ప్లాన్ నుండి అత్యంత ఖరీదైన టైటానియం ప్లాన్‌ల పేరుతో వివిధ రకాల ధరల వద్ద జియోఫైబర్ ప్లాన్‌లను అందిస్తుంది. అన్ని ప్లాన్‌లు నెలవారీ క్యాప్ ప్రాతిపదికన వినియోగదారులకు కొంత మొత్తంలో డేటాను అందిస్తాయి. ఇప్పుడు కొత్త ప్లాన్లు ఆ పరిమితిని గణనీయంగా పెంచాయి. చాలా మంది వినియోగదారులు వారి యొక్క ఇంటి అవసరాలకు మరియు వినోద అవసరాల కోసం మరియు ప్రస్తుతము ఇంటి వద్ద నుండి చాలా మంది వారి యొక్క ఆఫీస్ వర్క్ చేయడానికి ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నందున ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

రిలయన్స్ జియోఫైబర్ నెలవారీ ప్లాన్‌లు

రిలయన్స్ జియోఫైబర్ నెలవారీ ప్లాన్‌లు

జియోఫైబర్ యొక్క బ్రోన్స్ నెలవారీ ప్లాన్‌లో మొత్తంగా 250GB డేటాను అందించేది. కానీ ఇప్పుడు కొత్త మార్పులలో డేటాను 350GB వరకు పెంచారు. అదేవిధంగా JioFiber సిల్వర్ నెలవారీ ప్లాన్ ఇప్పుడు 800GB అపరిమిత డేటాను మునుపటి ధర వద్దనే అందిస్తుంది.

జియోఫైబర్  గోల్డ్ ప్లాన్,ప్లాటినం ప్లాన్

జియోఫైబర్ గోల్డ్ ప్లాన్,ప్లాటినం ప్లాన్

దీని కన్న మరింత ఎక్కువ డేటా అవసరమైన వారికోసం గోల్డ్ ప్లాన్ వంటివి కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు నెలకు 250 Mbps వేగంతో 1,750GB అపరిమిత డేటాను అందిస్తుంది. అలాగే డైమండ్ యొక్క నెలవారి ప్లాన్ 500 Mbps వేగంతో 4,000GB అపరిమిత డేటాను అందిస్తుంది. చివరగా అత్యంత ఖరీదైన ప్లాటినం నెలవారి ప్లాన్ 1Gbps వేగంతో 7,500GB అపరిమిత డేటాను అందిస్తుంది. Reliance Jio: లాక్ డౌన్ లో జియోలో ఉపయోగకరమైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే...

జియోఫైబర్ ప్లాన్‌ల అదనపు ప్రయోజనాలు

జియోఫైబర్ ప్లాన్‌ల అదనపు ప్రయోజనాలు

జియోఫైబర్ యొక్క అన్ని ప్లాన్‌లు వినియోగదారులకు డేటా ప్రయోజనాలతో పాటుగా తన కాంప్లిమెంటరీ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటిలో ఉచిత జియో వాయిస్ యాక్సెస్, సంవత్సరానికి 1,200 రూపాయల విలువైన టీవీ వీడియో కాలింగ్ కాన్ఫరెన్సింగ్ ప్రయోజనాలు కూడా జియో ఫైబర్ ప్రణాళికల ద్వారా అదనంగా అందిస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రణాళికలు హోమ్-నెట్‌వర్కింగ్‌తో పాటు జీరో-లేటెన్సీ గేమింగ్ అనుభవాలను కూడా అందిస్తాయి.

జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ న్యూస్

జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ న్యూస్

రిలయన్స్ జియో యొక్క ఇతర ముఖ్యమైన వార్తలలో సర్వీస్ ప్రొవైడర్ చేత రూ .100 లోపు చౌకైన ప్లాన్లలో అందిస్తున్న చౌకైన రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసింది. అయితే ఇప్పుడు రిలయన్స్ జియో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ ను వినియోగదారులకు రూ.129 ధర వద్ద అందిస్తున్నది. ఈ ప్లాన్ మీకు 2 జిబి డేటా, 1000 నిమిషాల నాన్-జియో వాయిస్ కాల్స్ ప్రయోజనాలను 28 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తున్నది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance JioFiber New Plans Benefits Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X