జియో మరో సంచలనం: ఈ సారి షాక్ ఎవరికీ ?

డీటీహెచ్ బ్రాడ్ బాండ్ సేవల్లో విప్లవాత్మక మార్పులు, ప్రతి ఇంటికీ రిలయన్స్ డీటీహెచ్ సర్వీసులు

By Hazarath
|

4జీతో మార్కెట్ మొత్తాన్ని షేక్ చేసిన జియో ఇప్పుడు మరో సంచలనానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రయల్స్ కూడా వేసేసింది. ఇంతకీ ఏంటీ ఆ సంచలనం అనుకుంటున్నారా.. డీటీహెచ్ బ్రాడ్ బాండ్ సేవల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే ప్రతి ఇంటికీ రిలయన్స్ డీటీహెచ్ సర్వీసులు చేరే అవకాశం ఉంది.

శాంసంగ్ విశ్వరూపం, మడతపెట్టేలా గెలాక్సీ 10

డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవల్లోనూ

డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవల్లోనూ

రిలయన్స్ ఇప్పుడు డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలను రిలయన్స్ అందిస్తోంది.

బ్రాడ్ బ్రాండ్ కంపెనీలకు షాక్

బ్రాడ్ బ్రాండ్ కంపెనీలకు షాక్

జియో టీవీతో ప్రస్తుతం ఉన్న డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ కంపెనీలకు షాక్ ఇవ్వనుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ తో

హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ తో

హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ తో ఒక జీబీపీస్ వరకు ఇంటర్నెట్ అందించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల కేబుల్స్ వేసింది. అయితే ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందా, లేదా అనేది వెల్లడికాలేదు.

సెట్ అప్ బ్యాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్

సెట్ అప్ బ్యాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్

డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు జియో సేవలు కూడా అందించాలని రిలయన్స్ యోచిస్తోంది. వీటికి సంబంధించిన సెట్ అప్ బ్యాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్ అందించి నిరాంతరాయంగా హైస్పీడ్ ఇంటర్నెట్ కల్పించాలని సన్నాహాలు చేస్తోంది.

4 కే వీడియోలు వీక్షించే అవకాశం

4 కే వీడియోలు వీక్షించే అవకాశం

ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా 4 కే వీడియోలు వీక్షించే అవకాశం కలుగుతుంది.

 360 పైగా చానళ్లు

360 పైగా చానళ్లు

జియో టీవీ ద్వారా 360 పైగా చానళ్లు (ఇందులో కనీసం 50 హెచ్ డీ చానళ్లు) వీక్షకులకు అందుబాటులో ఉంచనుంది. తమకు కావాల్సిన కార్యక్రమాలను జియో సర్వర్లతో సేవ్ చేసుకోవచ్చు.

మాటలతో పనిచేసే రిమోట్

మాటలతో పనిచేసే రిమోట్

మాటలతో పనిచేసే రిమోట్ తో తమకు కావాల్సిన చానల్ మార్చుకోవచ్చు. అంతేకాదు కార్యక్రమం, కేటగిరి, నటీనటుల పేరు చెప్పి రిమోట్ ను ఆపరేట్ చేసే విధంగా ఫీచర్లు పొందుపరచనున్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio’s next big offering: 1Gbps optical fibre broadband and DTH read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X