జియో మళ్లీ షాకివ్వబోతోంది

Written By:

ఉచిత ఆఫర్లతో టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జియో మరో ఎత్తుగడకు తెరలేపింది. ఇప్పటిదాకా టెలికం రంగంలో తన ఆధిపత్యాన్ని చాటిన ముఖేష్ అంబానీ ఇప్పుడు టెలికం రంగంలోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ధీరూభాయి అంబాని నాలెడ్జి సిటీలో ప్రయోగాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్లను కంట్రోల్ చేసేందుకు అక్కడ ఓ సరికొత్త యాప్ తయారవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

జియో దెబ్బ, డేటా ప్యాక్‌లపై వొడాఫోన్ బంఫరాఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డివైజ్ ద్వారానే వాహన కదలికలను కంట్రోల్

రిలయన్స్ జియో కార్లను కంట్రోల్ చేసే విధంగా ఓ మొబైల్ యాప్‌ను రూపొందించబోతోంది. ఈ యాప్‌తో డివైజ్ ద్వారానే వాహన కదలికలను కంట్రోల్ చేయొచ్చు.

కారు యజమానికి అలర్ట్

కేవలం కారు కంట్రోలింగ్ వ్యవస్థనే కాకుండా ఇంధనం, బ్యాటరీ అయిపోతున్నప్పుడు కారు యజమానికి అలర్ట్ వచ్చేలా కూడా ఈ యాప్ దోహదం చేయనుందట.

కారులో వై-ఫై

అంతే కాకుండా ఈ యాప్‌తో వాహనం దొంగతనానికి గురైనప్పుడు కారు కదలికలను ఓనర్ ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇక కారులో వై-ఫై వాడుకోవచ్చు.

డివైజ్‌లో జియో సిమ్

అయితే కారు ఓనర్ ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే తన డివైజ్‌లో జియో సిమ్ వాడాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి.

ఆటోమొబైల్ కంపెనీలతో జియో చర్చలు

దీనికోసం ఆటోమొబైల్ కంపెనీలతో జియో నడుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ డిజిటల్ మిషన్ ఆటో మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

మైఫై డివైజ్ ధర

జియో మైఫై డివైజ్ ధర(రూ.2000) కంటే తక్కువగాను, దానికి సమానంగాను ఉండొచ్చని సమాచారం. కారు యాప్‌తో పాటు, త్వరలోనే జియో టీవీలు వినియోగదారుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio’s next ‘digital mission’: Connected car app, JioTV and more read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot