దీపావళికి రిలయన్స్ 4జీ ఫోన్

Posted By:

93,000 కోట్ల భారీ వ్యయంతో ‘రిలయన్స్ జియో' బ్రాండ్ క్రింద టెలికామ్ వెంచర్‌ను ప్రారంభించిన రిలియన్స్ ఇండస్ట్రీస్ తన 4జీ స్మార్ట్‌ఫోన్‌లను దీపావళికి లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘Lyf'బ్రాండ్ పేరుతో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

Read More : 10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

ఈ ఫోన్‌లు అత్యంత తక్కువ ధరల్లో మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం 5 హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీలతో రిలయన్స్ ఒప్పందాలు కుదుర్చుకుంది. రిలయన్స్ అందించే 4జీ ఫోన్‌లు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ ఆధారిత ఎల్టీఈ ఇంకా వై-ఫై కాల్స్‌ను సపోర్ట్ చేస్తుంది. పనితీరు పరంగా ఈ ఫోన్‌లు మరింతగా ఆకట్టుకుంటాయని మార్కెట్ వర్గాల టాక్.

Read More : ఈ వారం మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును ప్రోత్సహించే విధంగా రిలయన్స్ తమకు అవసరమైన 4జీ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లోనే తయారు చేయించేందుకు లెనోవో, మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఇంటెక్న్ వంటి కంపెనీలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

రిలయన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్న 4జీ స్మార్ట్ ఫోన్ లు, డాంగిల్స్ అలానే రౌటర్లను ఇప్పటికే హువావీ, జెడ్‌టీఈ, ఆల్కాటెల్ వన్‌టచ్, సీకే-టెలికామ్, బీజింగ్ కే-టచ్ వంటి కంపెనీలు ఇప్పటికే తయారు చేస్తున్నాయట. రిలయన్స్ అందించే 4జీ ఫోన్‌ల ధరలు రకాన్ని బట్టి రూ.4,000 నుంచి రూ.25,000 వరకు ఉండొచ్చట. 1000 జియో సెంటర్ల ద్వారా 200 పట్టణాల్లో రిలయన్స్ జియో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ సన్నహాలు చేస్తోన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీ వార్‌కు తెర లేచింది

4జీ టెక్నాలజీ దిగొస్తున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కొత్త ఆవిష్కరణలో వేడెక్కుతోంది. అయితే, 3జీ ఫోన్లు పూర్తి స్థాయిలో కష్టమర్ల చేతుల్లో పడకుండానే 4జీ టెక్నాలజీ విస్తరిస్తుండటం కొంత విడ్డూరంగా ఉంది. ఏదేమైనప్పటికి 4జీ ఫోన్లతో భారత్ మొబైల్ పరిశ్రమ రోజు రోజుకు వేడెక్కిపోతోంది.

4జీ వార్‌కు తెర లేచింది

ఇండియా చైనాల మధ్య ఇప్పుడు 4జీ యుద్ధం మొదలైంది. స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో ఇండియా చైనా పోటీ పడుతూ ముందుకు దూసుకువెళుతున్నాయి. చైనా 4జీ ఫోన్లకు ఇండియా డంపింగ్ గ్రౌండ్ కావడంతో ఇక్కడి కంపెనీలకు సవాల్ మొదలైంది.

4జీ వార్‌కు తెర లేచింది

ఇండియన్ కంపెనీలు చైనా ఫోన్లకు ధీటుగా తమ ఫోన్‌లను మార్కెట్‌లోకి దించుతున్నాయి. అంతే కాకుండా కొన్ని చోట్ల చైనా ఫోన్లను తిరస్కించడం కూడా ఇండియా బ్రాండ్ మార్కెట్‌లో వేడి రగులుతోంది.

4జీ వార్‌కు తెర లేచింది

శక్తివంతమైన స్పెక్స్‌తో భారత్ కంపెనీలకు ధీటుగా ఫోన్‌లను ఆఫర్ చేస్తోన్న
చైనా కంపెనీలు కస్టమర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

4జీ వార్‌కు తెర లేచింది

ఇండియా చైనాల మధ్య ఇప్పుడు 4జీ యుద్ధం మొదలైంది. స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ఇండియా చైనా పోటీ పడుతూ ముందుకు దూసుకువెళుతున్నాయి. చైనా 4జీ ఫోన్లకు ఇండియా డంపింగ్ గ్రౌండ్ కావడంతో ఇక్కడి కంపెనీలకు సవాల్ మొదలైంది.

4జీ వార్‌కు తెర లేచింది

భారత్ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను చైనా శాసిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇందుకు ఉదాహరణ చైనా కంపెనీలు భారత్‌లో 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండటమే.

4జీ వార్‌కు తెర లేచింది

చైనాలో 4జీ వినియోగదారులు 45 శాతం ఉంటే భారత్ లో అది కేవలం 10 శాతం కన్నా తక్కువగానే ఉంది.

4జీ వార్‌కు తెర లేచింది

చైనా 4జీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు భారత్‌లో పాగా వేసేందుకు సిద్ధమైయ్యాయి. ఇండియా బ్రాండ్లకంటే ఎక్కువ అమ్మాకాలను సాధిస్తామనే ధీమాతో చైనా కంపెనీలు ఉన్నాయి. మరి ఇండియా దానికి ధీటుగా అమ్మకాలు సాగిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

4జీ వార్‌కు తెర లేచింది

2015లో ప్రపంచ స్మార్ట్ ఫోన్ విక్రయాల వృద్ధిలో భారత్ మార్కెట్‌దే ప్రధాన పాత్ర అని జీఎఫ్ కె కెవిన్ వాల్ష్ వెల్లడించారు కూడా.2016లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఫీచర్ ఫోన్లను మించిపోతుందని విశ్లషకులు అంటున్నారు.

4జీ వార్‌కు తెర లేచింది

భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే భారత్‌లో 4జీ సర్వీస్‌లను అందిస్తోంది. ఇదే కోవలో రిలయన్స్ కూడా తన జియో సేవలతో 4జీ మార్కెట్ లోకి దూసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance to Start Selling Its 4G Smartphones From Diwali. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot