బ్లాక్‌బెర్రీ కొత్త వోఎస్, కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణ

Posted By:

కెనాడాకు చెందిన ప్రముఖ బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) బుధవారం ‘బ్లాక్‌బెర్రీ 10' (బీబీ10) పేరుతో కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను ఆవిష్కరించింది. ఈ వోఎస్ ఆధారంగా పనిచేసే రెండు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను (జెడ్10, క్యూ10) బ్లాక్‌బెర్రీ ఈ సందర్భంగా పరిచయం చేసింది. అంతేకాకుండా, తమ కంపెనీ పేరును కూడా బ్లాక్‌బెర్రీగా మార్చేసినట్లు సంస్థ సీఈవో థార్సటన్ హెయిన్స్ తెలిపారు.

రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?

ఈ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లతో పూర్తి వైభవాన్ని దక్కించుకోగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. క్వర్టీ ఇంకా టచ్ వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ఈ ‘బ్లాక్‌బెర్రీ 10' స్మార్ట్‌ఫోన్‌లు యాపిల్ ఐఫోన్ ఇంకా గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు గట్టిపోటీ నివ్వగలమని బ్లాక్‌బెర్రీ వర్గాలు భావిస్తున్నాయి.

బ్లాక్‌బెర్రీ కొత్త వోఎస్, కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణ

ఈ హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఖచ్చితమైన సమచారం అందాల్సి ఉంది. బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన సమాచారాన్ని గిజ్‌బాట్ త్వరలో మీముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot