ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు కట్టబోయి 96వేలు మోసపోయాడు
ప్రభుత్వం 2016 లో డీమోనిటైజేషన్ ప్రకటించినప్పటి నుండి దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ ఆన్‌లైన్ మోసగాళ్ల రూపంలో కొంత రిస్క్ వచ్చింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక సంఘటనలో 31 ఏళ్ల ముంబైకు చెందిన ఒక వ్యక్తిని రూ.96,000 మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రజలను మోసగించడానికి గూగుల్ పే కస్టమర్ కేర్‌గా తన నంబర్‌ను పోస్ట్ చేసిన మోసగాడి కోసం వెతుకుతున్నామని అంధేరి పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఒక ప్రైవేట్ సంస్థ ఉద్యోగి అయిన ఫిర్యాదుదారుడు ఆగస్టు 21 న గూగుల్ పే ఉపయోగించి తన విద్యుత్ బిల్లును చెల్లించడానికి ప్రయత్నించాడు.

లావాదేవీలో కొంత లోపం ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. ఫిర్యాదుదారుడు గూగుల్ పే మొబైల్ యాప్ యొక్క కస్టమర్ కేర్ నంబర్ కోసం శోధించి అతను ఆన్‌లైన్‌లో ఒక నంబర్‌ను కనుగొని దాన్ని సంప్రదించాడు. కానీ అతను కనుగొన్న ఫోన్ నెంబర్ మోసగాడిదని తెలిసి తరువాత కంగుతిన్నాడు. ఆన్‌లైన్‌లో డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫామ్ యొక్క కస్టమర్ కేర్‌గా తన సొంత నంబర్‌ను అప్‌డేట్ చేసిన సైబర్ మోసగాడు గూగుల్ పే యొక్క అధికారిగా నటించి చాలా మంది వినియోగదారులను మోసం చేసాడు అని ఒక పోలీసు అధికారి చెప్పారు.

నిందితుడి యొక్క ఫిర్యాదు ప్రకారం మోసగాడు ఫిర్యాదుదారునికి కలెక్ట్ రిక్వెస్ట్ పంపించి దానిపై క్లిక్ చేయమని కోరాడు. అతడు మోసగాడు అని తెలియని ఫిర్యాదుదారుడు లింక్‌పై క్లిక్ చేయడంతో అతని ఖాతా నుండి 96,000 రూపాయలు బదిలీ అయ్యాయి అని అతను ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అనంతరం ఫిర్యాదుదారు అంధేరి పోలీసులకు నివేదిక ఇచ్చాడు. పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తిపై చీటింగ్ (మోసం) కేసు నమోదు చేశారు.

ఆగస్టు చివరి వారంలో మేము ఈ కేసును నమోదు చేసాము. ఈ నేరానికి ఉపయోగించిన ఫోన్ నెంబర్ రాజస్థాన్‌లో నమోదు చేయబడింది. కాని నిందితుడు ఆ రాష్ట్రం నుండి పనిచేస్తున్నాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మా యొక్క దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని మరో పోలీసు అధికారి ప్రెస్ కు తెలిపారు.

తమకు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక ఫిర్యాదు వచ్చింది. అదే నెంబర్ ద్వారా మోసం చేయబడిన అనేక మంది ఇంకా ఉండవచ్చునని అధికారి ధృవీకరించారు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేసేటప్పుడు లేదా డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని ఈ సంఘటన హైలైట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications