ఆపిల్,గూగుల్ కంపెనీలకు రష్యా గట్టి హెచ్చరికలు

Written By:

టెక్ దిగ్గజాలు గూగుల్ , ఆపిల్ కంపెనీలకు రష్యా గట్టి ఆదేశాలు ఇచ్చింది. రష్యాలో లింక్డ్ ఇన్ సర్వీసులు వెంటనే తొలగించాలని పిలుపునిచ్చింది. రష్యాలో గూగుల్ , ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్లలో లింక్డ్ ఇన్ సర్వీసుల యాప్ ఉండకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని టెక్ దిగ్గజాలు కూడా ధృవీకరించాయి.

ఐఫోన్ వచ్చి నేటికి 10 ఏళ్లు, హైలెట్స్ ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పౌరుల డేటాను ఇంటర్నెట్ సంస్థలు

దేశం సరిహద్దు లోపల గల పౌరుల డేటాను ఇంటర్నెట్ సంస్థలు నిల్వ ఉంచడం తమ స్థానిక చట్టాలకు విరుద్దమని, ఈ విషయంలో లింక్డ్ ఇన్ తమ చట్టాలను త్యజిస్తోందని రష్యా ఆరోపించింది.

దేశ డేటా రక్షణ నిబంధనలను

తాజాగా రష్యన్ కోర్టు సైతం మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్ ఇన్ సర్వీసులను బ్లాక్ చేసింది. దేశ డేటా రక్షణ నిబంధనలను లింక్డ్ ఇన్ సర్వీసు ఉల్లంఘిస్తుందనే నెపంతో వాటిని రద్దు చేసింది.

నెల క్రితమే

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం నెల క్రితమే లింక్డ్ ఇన్ యాప్‌ను రష్యాలో తొలగించాలంటూ ఆదేశాలు వచ్చినట్టు ఆపిల్ ధృవీకరించింది.

గూగుల్ ఈ విషయాన్ని

అయితే మరో టెక్ దిగ్గజం గూగుల్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. లింక్డ్ ఇన్‌ను రష్యాలో తొలగించిందో లేదో కూడా వెల్లడించడం లేదు.

రష్యన్ రెగ్యులేటర్లు తీసుకున్న నిర్ణయం

ఇదిలా ఉంటే తమ సర్వీసులను బ్లాక్ చేస్తూ రష్యన్ రెగ్యులేటర్లు తీసుకున్న నిర్ణయం కంపెనీని ఎంతో నిరాశపరిచిందని లింక్డ్ ఇన్ పేర్కొంటోంది. కంపెనీలు లింక్డ్ ఇన్ సర్వీసులను వాడితే, వ్యాపారాల్లో వృద్ధి సాధించవచ్చని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెబుతున్నారు.

లక్షల మంది యూజర్లు

కాగా రష్యాలో లింక్డ్ ఇన్ సర్వీస్‌లకు లక్షల మంది యూజర్లున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Russia asks Apple, Google to remove LinkedIn from app stores read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot