ఐఎస్‌ఐఎస్ వార్నింగ్‌తో వేడెక్కిన యుద్ధం

|

పారిస్‌లో ఉగ్రవాదులు సృష్టించిన భీభత్సం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఉగ్రవాదులు బాంబులు, తుపాకులు, ఆత్మాహుతి దాడులతో ఒకరోజంతా పారిస్ లోని వేర్వేరు ప్రాంతాలలో తెగబడి 130మందిని పొట్టనబెట్టుకున్న వైనం మాటలకు అందనిది. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని అన్ని దేశాలు ఇప్పుడు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా అమెరికా తన అణ్వాయుధాలపై ఫ్రమ్ పారిస్ విత్ లవ్ అంటూ రాసి వాటిని సిరియాలోని ఉగ్రవాదులపై వదిలింది. అయితే దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులు ఈ సారి వాషింగ్టన్ నడిబొడ్డున్న కాల్పులకు తెగబడతామని ప్రకటించారు. మిగతా కథనం స్లైడర్ లో

Read more G: ప్రతీకార జ్వాల : ఉగ్రవాదంపై ఫ్రాన్స్ పంజా

ఉగ్రవాదులపై అమెరికా పంజా

ఉగ్రవాదులపై అమెరికా పంజా

అందాల నగరాన్ని అల్లకల్లోలం చేసిన ఉగ్రవాదులపై అమెరికా పంజా విప్పింది. తన అత్యాధునిక మిస్సైల్ పై ఫ్రమ్ ఫారిస్ విత్ లవ్ అంటూ మేసేజ్ ఇచ్చి వాటిని ఉగ్రవాదులపై ప్రయోగించిండానికి సిద్ధమయింది.

సోషల్ మీడియాలో భావావేశాలను కళ్లకు కట్టినట్లు

సోషల్ మీడియాలో భావావేశాలను కళ్లకు కట్టినట్లు

ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో భావావేశాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అమెరికా హెల్ ఫైర్ మిస్సైల్స్ అలాగే జేడీఎమ్ బాంబులు ఇవన్నీ పారిస్ దాడులకు సంఘీభావంగా ఉగ్రవాదులపై అమెరికా ప్రయోగిస్తోంది.

యుఎస్ ఆర్మీ అధికారులు పారిస్ పై దాడులకు సంఘీభావంగా
 
యుఎస్ ఆర్మీ అధికారులు పారిస్ పై దాడులకు సంఘీభావంగా

యుఎస్ ఆర్మీ అధికారులు పారిస్ పై దాడులకు సంఘీభావంగా ఇలా అణ్వాయుధాలపై రాసి వారిపై ప్రయోగిస్తున్నారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం నుండి ఈరకమైన మేసేజ్ లు అమెరికా ఇస్తూ వస్తోంది. ప్రతీకారానికి సంబంధించిన మేసేజ్ లను అణ్వాయుధాలపై రాసి శత్రువులపై ప్రయోగిస్తోంది.

ఈ బాంబులను సిరియా;ఇరాక్ లో గల ఐఎస్ ఐఎస్ స్థావరాలపై

ఈ బాంబులను సిరియా;ఇరాక్ లో గల ఐఎస్ ఐఎస్ స్థావరాలపై

ఈ బాంబులను సిరియా;ఇరాక్ లో గల ఐఎస్ ఐఎస్ స్థావరాలపై ప్రయోగించాలని వ్యూహాలకు తెరలేపింది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు యుద్ధం మెదలైంది అని చెప్పడంతో అన్ని దేశాలు మద్దతుగా రంగంలోకి దిగుతున్నాయని తెలుస్తోంది.

అమెరికా దాడులు

అమెరికా దాడులు

ఇదిలా ఉంటే అమెరికా నేతృత్వంలోని దళాలు ఈశాన్య సిరియాపై విరుచుకుపడుతున్నట్టు పెంటగాన్‌ అధికారులు పేర్కొ న్నారు. ఇరాక్‌, సిరియా సరిహద్దులోని డెఈర్‌ ఎజ్జార్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఐఎస్‌ చమురు ట్రక్కులపై తొలిదాడి జరిపామని, మొత్తం 116 చమురు ట్రక్కులను ధ్వంసం చేశామని తెలిపారు.

చమురు నిల్వలు అధికంగా ఉండడంతో దీనిపై ఐఎస్‌ ఆధిపత్యం

చమురు నిల్వలు అధికంగా ఉండడంతో దీనిపై ఐఎస్‌ ఆధిపత్యం

ఈ ప్రావిన్స్‌లో చమురు నిల్వలు అధికంగా ఉండడంతో దీనిపై ఐఎస్‌ ఆధిపత్యం చలా యిస్తున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తర, మధ్య సిరి యాల్లోనూ పదికిపైగా దాడులు చేసినట్టు పెంటగాన్‌ అధికారులు తెలిపారు. తాము ఇరాక్‌లోనూ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నామని ఐఎస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరాక్‌లో 13 దాడులు చేసినట్టు చెప్పారు.

ఐఎస్‌ పనిపట్టే దిశగా తన దాడులను

ఐఎస్‌ పనిపట్టే దిశగా తన దాడులను

ఇక ప్రపంచ ప్రఖ్యాత పారిస్‌ నగరం నడిబొడ్డున రక్తపుటేర్లు పారించి 129 మందిని పొట్టనబెట్టుకున్న ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రమూకలపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఫ్రాన్స్‌... ఐఎస్‌ పనిపట్టే దిశగా తన దాడులను ముమ్మరం చేసింది.

అమెరికాతో కలసి సిరియాలోని ఐఎస్‌ స్థావరాలపై

అమెరికాతో కలసి సిరియాలోని ఐఎస్‌ స్థావరాలపై

ఉగ్రమూకల పని పట్టేందుకు తమ వంతు సాయం చేస్తామన్న అమెరికాతో కలసి సిరియాలోని ఐఎస్‌ స్థావరాలపై యుద్ధ విమానాలు, బాంబులతో విరుచుకుపడుతోంది. సిరియాలో ఉగ్రవాదులు తమ రాజధానిగా పరిగణిస్తున్న రక్కాపై ఆదివారం తొలిసారి ఫ్రాన్స్‌ యుద్ధ విమానాలు చెలరేగి బాంబుల వర్షం కురిపించాయి.

ఈ ఆపరేషన్‌ మొత్తం అమెరికా బలగాల సాయంతో నిర్వహిస్తున్నామని..

ఈ ఆపరేషన్‌ మొత్తం అమెరికా బలగాల సాయంతో నిర్వహిస్తున్నామని..

ఈ దాడిలో ఐఎస్‌ కమాండ్‌ పోస్ట్‌, జిహాదీ నియామక కేంద్రం, ఉగ్రవాదుల ఆయుధ కర్మాగారం, శిక్షణ శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్‌ మొత్తం అమెరికా బలగాల సాయంతో నిర్వహిస్తున్నామని, మొత్తం 12 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని, జోర్డాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరే ట్స్‌ల మీదుగా ఈ దాడులు జరిపినట్టు పేర్కొన్నారు.

ఐఎస్‌ను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని..

ఐఎస్‌ను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని..

మరోపక్క, ఉగ్ర దాడిని దేశ చరిత్రలో అత్యంత దారుణమైందిగా పేర్కొన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు.. హోలాండె.. ఐఎస్‌ను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని చెప్పిన క్రమంలో తమ దాడులను మరింత ముమ్మరం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ‘మా తొలి లక్ష్యంలో భాగంగా ఐఎస్‌ కమాండ్‌ పోస్టును, రిక్రూట్‌మెంట్‌ కేంద్రాన్ని, ఆయుధ కర్మాగారాన్నీ ధ్వంసం చేశాం' అని మంత్రి పేర్కొన్నారు.

ఇప్పుడు ఐఎస్ ఎస్ అమెరికాకు కూడా వార్నింగ్

ఇప్పుడు ఐఎస్ ఎస్ అమెరికాకు కూడా వార్నింగ్

అయితే ఇప్పుడు ఐఎస్ ఎస్ అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. సిరియాలో తమపై వైమానిక దాడులు చేస్తున్న ఇతర దేశాలకూ ఫ్రాన్స్‌కు పట్టిన గతే పడుతుందని ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ ఓ వీడియోలో హెచ్చరించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో సైతం భారీ దాడులకు పాల్పడతామని ప్రకటించింది.

ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నడిబొడ్డునా ..

ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నడిబొడ్డునా ..

‘‘దేవుడి తరఫున జరుగుతున్న మతయుద్ధంలోకి దిగేదేశాలకు మేం చెబుతున్నదిదే. పారిస్‌ మాదిరిగా మీ గురించి దేవుడు తలచుకునే రోజు మీకూ వస్తుంది. ఇప్పటికే పారిస్‌ నడిబొడ్డున దాడి చేశాం. ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నడిబొడ్డునా దాడికి ప్రతిన బూనాం'' అంటూ ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న వీడియోను ఐఎస్‌ విడుదల చేసింది. అతడి పేరు ‘అల్‌ ఘరీబ్‌ ద అల్జీరియన్‌'గా స్ర్కోలింగ్‌లో కనిపించింది.

ఫ్రాన్స్‌తోపాటు యూరోప్‌లోని ఇతర దేశాల్లోనూ తీవ్రదాడులకు

ఫ్రాన్స్‌తోపాటు యూరోప్‌లోని ఇతర దేశాల్లోనూ తీవ్రదాడులకు

అయితే, ఈ వీడియో సాధికారత ఇంకా నిర్ధారణ కాలేదు. ఇదిలాఉండగా, పారిస్‌లో నరమేధం సృష్టించిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఫ్రాన్స్‌తోపాటు యూరోప్‌లోని ఇతర దేశాల్లోనూ తీవ్రదాడులకు సిద్ధమవుతున్నారని ఫ్రాన్స్‌ ప్రధాని మాన్యుయెల్‌ వాల్స్‌ వెల్లడించారు.

ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నడిబొడ్డునా ..

ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నడిబొడ్డునా ..

‘‘దేవుడి తరఫున జరుగుతున్న మతయుద్ధంలోకి దిగేదేశాలకు మేం చెబుతున్నదిదే. పారిస్‌ మాదిరిగా మీ గురించి దేవుడు తలచుకునే రోజు మీకూ వస్తుంది. ఇప్పటికే పారిస్‌ నడిబొడ్డున దాడి చేశాం. ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నడిబొడ్డునా దాడికి ప్రతిన బూనాం'' అంటూ ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న వీడియోను ఐఎస్‌ విడుదల చేసింది. అతడి పేరు ‘అల్‌ ఘరీబ్‌ ద అల్జీరియన్‌'గా స్ర్కోలింగ్‌లో కనిపించింది.

మరోవైపు పారిస్‌ ఉగ్రదాడి జరిగిన రోజే ఇస్తాంబుల్‌పైనా విరుచుకుపడేందుకు..

మరోవైపు పారిస్‌ ఉగ్రదాడి జరిగిన రోజే ఇస్తాంబుల్‌పైనా విరుచుకుపడేందుకు..

ఉగ్రమూకలు మరిన్ని భయానక దాడులకు వ్యూహాలు పన్నుతున్నాయని, ఇకపైనా ఫ్రాన్స్‌కు ముప్పు పొంచి ఉంటుందన్నారు. మరోవైపు పారిస్‌ ఉగ్రదాడి జరిగిన రోజే ఇస్తాంబుల్‌పైనా విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను టర్కీ భగ్నం చేసింది.

బ్రిటన్‌లో సైతం గత ఆరు నెలల్లోనే ఏడు ఉగ్రదాడుల కుట్రలను..

బ్రిటన్‌లో సైతం గత ఆరు నెలల్లోనే ఏడు ఉగ్రదాడుల కుట్రలను..

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాది జిహాదీ జాన్‌కు సన్నిహితుడైన వ్యక్తితో సహా ఐదుగురిని అదేరోజు ఇస్తాంబుల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక బ్రిటన్‌లో సైతం గత ఆరు నెలల్లోనే ఏడు ఉగ్రదాడుల కుట్రలను నిఘా వర్గాలు ఛేదించినట్లు ప్రధాని డేవిడ్‌ కేమరాన్‌ వెల్లడించారు.

పారిస్‌ లాంటి దాడులు ఇకముందు ఏ దేశంలోనైనా

పారిస్‌ లాంటి దాడులు ఇకముందు ఏ దేశంలోనైనా

టర్కీలో కొనసాగుతున్న జీ20 సదస్సుకు హాజరైన ఆయన ఈ మేరకు బ్రిటిష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పారిస్‌ లాంటి దాడులు ఇకముందు ఏ దేశంలోనైనా జరగొచ్చన్నారు. సిరియాలోని బ్రిటన్‌ పౌరులను ఉగ్రవాదులుగా మారుస్తూ, దాడులకు పంపుతున్న ఉదంతాలనూ తమ నిఘావర్గాలు పసిగడుతు న్నాయని చెప్పారు.

ఇంతగా దాడులకు ఉగ్రవాదులు తెగబడుతుండటంతో..

ఇంతగా దాడులకు ఉగ్రవాదులు తెగబడుతుండటంతో..

పారిస్‌లాంటి మరిన్ని దాడులకు ఐఎస్‌ వ్యూహం పన్నినట్లు అ మెరికా నిఘాసంస్థ సీఐఏ డైరెక్టర్‌ జాన్‌బ్రెన్నన్‌ కూడా హెచ్చరించారు.ఇంతగా దాడులకు ఉగ్రవాదులు తెగబడుతుండటంతో ప్రపంచ దేశాలు దాని సమూల నాశనానికి నడుం బిగించాయని తెలుస్తోంది.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write From Paris, With Love': Emotive message of revenge scrawled across the U.S. bombs destined for Syria

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X