Home
News

Samsung Big TV Days Sale: ‌టీవీల కొనుగోలుపై గెలాక్సీ A51,A31 ఫోన్‌లను ఉచితంగా పొందే గొప్ప అవకాశం..

ప్రముఖ శామ్సంగ్ సంస్థ ఇండియాలో ఇప్పుడు 'బిగ్ టీవీ డేస్' అమ్మకాన్ని నిర్వహిస్తోంది. ఈ సమయంలో 55 అంగుళాలు మరియు అంతకంటే ఎక్కువ పెద్ద స్క్రీన్ టీవీ మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. ఎంచుకున్న టీవీ మోడళ్ల కొనుగోలుపై శామ్‌సంగ్ గెలాక్సీ A51, గెలాక్సీ A31 స్మార్ట్‌ఫోన్‌లతో పాటు సౌండ్‌బార్ హెచ్‌డబ్ల్యూ-క్యూ 800T, సౌండ్‌బార్ హెచ్‌డబ్ల్యూ-క్యూ 900T లను కంపెనీ ఉచితంగా ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ల వద్ద ఈ ఆఫర్లను పొందవచ్చని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. శామ్సంగ్ బిగ్ టివి డేస్ ఆఫర్లు 2021 జనవరి 31 వరకు అందుబాటులో ఉంటాయి.

Samsung Big TV Days Sale డిస్కౌంట్ ఆఫర్స్

Samsung Big TV Days Sale డిస్కౌంట్ ఆఫర్స్

55-అంగుళాల, 65-అంగుళాల, 75-అంగుళాల, 82-అంగుళాల మరియు 85-అంగుళాల పరిమాణంలో లభించే QLED టీవీలు, క్రిస్టల్ 4K UHD, QLED 8K పెద్ద స్క్రీన్ శామ్‌సంగ్ టీవీలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ యొక్క అన్ని రకాల ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు. అదనంగా వినియోగదారులు 20% క్యాష్‌బ్యాక్ మరియు పొడిగించిన వారంటీ ఆఫర్‌లతో పాటు నెలకు రూ.1,990 EMI లతో పొందవచ్చు.

గెలాక్సీ A51,A31 ఫోన్‌ల ఉచిత ఆఫర్స్

గెలాక్సీ A51,A31 ఫోన్‌ల ఉచిత ఆఫర్స్

శామ్సంగ్ బిగ్ టీవీ డేస్ అమ్మకం సమయంలో 65-అంగుళాల క్యూఎల్‌ఇడి టివి మరియు 75-అంగుళాల క్రిస్టల్ 4K UHD టివిలను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.22,999 విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్ ను ఉచితంగా పొందే అవకాశం లభిస్తుంది. అలాగే 55-అంగుళాల క్యూఎల్‌ఇడి టీవీలు, 65 అంగుళాల క్రిస్టల్ 4K యుహెచ్‌డి టివిల కొనుగోలు మీద రూ.18,999 విలువైన గెలాక్సీ A31 స్మార్ట్‌ఫోన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే 75-అంగుళాల, 82-అంగుళాల మరియు 85-అంగుళాల QLED టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఎంచుకున్న టీవీ మోడళ్ల మీద రూ.48,990 విలువైన సౌండ్‌బార్ HW-Q800T లేదా రూ.99,990 విలువైన సౌండ్‌బార్ HW-Q900T ను ఉచితంగా పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఈ అమ్మకంలో QLED టివిల మీద 10సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ, ఒక సంవత్సరం సమగ్ర వారంటీ మరియు ప్యానెల్‌ మీద ఒక సంవత్సరం అదనపు వారంటీతో వస్తాయని శామ్‌సంగ్ పేర్కొంది.

శామ్సంగ్ QLED క్వాంటం డాట్ టెక్నాలజీ ఫీచర్స్

శామ్సంగ్ QLED క్వాంటం డాట్ టెక్నాలజీ ఫీచర్స్

శామ్సంగ్ QLED టివి క్వాంటం డాట్ టెక్నాలజీ ఆధారితంగా వస్తుంది. ఇది ప్రకాశవంతమైన మరియు మెరుగైన కలర్లను అందించడానికి టీవీ యొక్క ప్రకాశ స్థాయిలను ఆప్టిమైజ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ (OTS) మరియు యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్ (AVA) వంటి ఫీచర్లతో టీవీలు రవాణా చేయబడతాయి. మరొక ముఖ్యమైన ఫీచర్లలో యాంబియంట్ మోడ్ కూడా ఉన్నాయి. ఇది టీవీ ఉపయోగంలో లేనప్పుడు మీ యొక్క ఫోటోలను ఇంటరాక్టివ్ నేపథ్యంలో ప్రదర్శించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

శామ్సంగ్ 4K UHD టీవీ క్రిస్టల్ టెక్నాలజీ ఫీచర్స్

శామ్సంగ్ 4K UHD టీవీ క్రిస్టల్ టెక్నాలజీ ఫీచర్స్

శామ్సంగ్ యొక్క 4K UHD టీవీలు క్రిస్టల్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ టీవీలు క్రిస్టల్ 4K డిస్ప్లే, మల్టీ-వ్యూ, అడాప్టివ్ సౌండ్, ట్యాప్ వ్యూ, స్క్రీన్ మిర్రరింగ్ మరియు లాగ్-ఫ్రీ గేమింగ్ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. శామ్సంగ్ యొక్క QLED 8K టీవీల ముఖ్యమైన ఫీచర్లలో రియల్ 8K రిజల్యూషన్, 8K AI అప్‌స్కేలింగ్, క్వాంటం ప్రాసెసర్ 8K మరియు క్వాంటం హెచ్‌డిఆర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

శామ్సంగ్ 55-ఇంచ్ టీవీలపై డిస్కౌంట్ ఆఫర్స్

శామ్సంగ్ 55-ఇంచ్ టీవీలపై డిస్కౌంట్ ఆఫర్స్

ప్రస్తుతం 55-అంగుళాలు మరియు దాని కంటే పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీలకు పెద్ద పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాలు మరియు గ్రామీణ మార్కెట్లలో కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇంట్లో వినోదం కోసం అధిక-నాణ్యత గల OTT కంటెంట్ లభ్యత అవసరం దృష్ట్యా వినియోగదారులు ఇంట్లో సినిమా వీక్షణ అనుభవాన్ని అందించే పెద్ద టీవీలను కొనాలనుకుంటున్నారు. ‘బిగ్ టీవీ డేస్' ప్రమోషన్ తో నూతన సంవత్సరంలో వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అని శామ్సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెజెంట్ రాజు పుల్లన్ అన్నారు.

Best Mobiles in India

English summary
Samsung Big TV Days Sale Announced in India: Great Offers on Premium Range Smart TVs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X